ప్రపంచంలోని అత్యంత ఖరీదైన లవణాలలో ఇదొకటి. పావు కిలో ఎనిమిదివేల రూపాయల పైమాటే. వంటంతా అయ్యాక, చివరిగా ఫినిషింగ్ సాల్ట్‌గా వాడే వెదురు ఉప్పులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చర్మ, దంత సౌందర్యానికి వెదురు ఉప్పు ఉపకరిస్తుంది. అయితే సాధారణ ఉప్పు అన్ని దేశాలలో చౌక ధరలకు లభిస్తున్నప్పటికీ, కొన్ని అరుదైన లవణాలు నమ్మశక్యం కాని ధరలకు అమ్ముడవుతాయని మనలో చాలా మందికి తెలియదు.
అటువంటి ఖరీదైన ఉప్పులో వెదురు ఉప్పు ఒకటి. ఈ ఉప్పును వెదురు ఉప్పు, ఊదారంగు వెదురు ఉప్పు లేదా జుగ్యోమ్ అని కూడా అంటారు. ఈ ఉప్పు ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. వెదురు ఉప్పు ధర కిలోకు $400, ఇది భారతీయ పరిభాషలో దాదాపు 35000 రూపాయలు. కొరియన్ వెదురు ఉప్పు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఉప్పుగా పరిగణించబడుతుంది. కొరియన్ వంటలలో, సాంప్రదాయ కొరియన్ వైద్యంలో దీనిని ఉపయోగిస్తారు.
సముద్రపు ఉప్పును మందపాటి వెదురు కర్రలో ఉంచి, పైన్ కలపను ఉపయోగించి అధిక ఉష్ణోగ్రత వద్ద తొమ్మిది సార్లు కాల్చడం ద్వారా ఈ ఉప్పును తయారు చేస్తారు..దీని తయారీ విధానం చాలా క్లిష్టమైన ప్రక్రియ. కాబట్టి ఈ ఉప్పు ఖరీదైనది. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జుగ్యోమ్ లేదా కొరియన్ వెదురు ఉప్పు తయారీకి సంక్లిష్టమైన తయారీ ప్రక్రియ అవసరం. సాంప్రదాయ సముద్రపు ఉప్పు వెదురు డబ్బాలలో ప్యాక్ చేస్తారు. పసుపు మట్టితో కప్పి ఇనుప ఓవెన్‌లో కాల్చబడుతుంది.
పైన్ చెక్క మంటపై కాల్చుతారు. బేకింగ్ ప్రక్రియ తర్వాత, వెదురు ఉప్పులో నీలం, పసుపు, ఎరుపు, తెలుపు, నలుపు స్ఫటికాలు ఉంటాయి. ఈ ఉప్పుకు ప్రత్యేకమైన తీపి రుచిని కమ్రోజాంగ్ ఫ్లేవర్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇది ఈ ప్రక్రియలో వెదురు వాసనను గ్రహిస్తుంది.