బల్లులు తిరిగే ప్రదేశాలలో నాఫ్తలీన్ గోలీలు, లేదా నాఫ్తలీన్ పౌడర్ వేస్తే బల్లి ఆ వాసనకు పారిపోతుందని చెబుతున్నారు. అంతే కాదు గది యొక్క వెంటిలేటర్లు, కిటికీల మూలల్లో కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఉంచితే కూడా బల్లులు లేకుండా పోతాయని చెబుతున్నారు.వారానికి రెండు సార్లు వెల్లుల్లి రెబ్బలను మార్చుకోవాలని, వెల్లుల్లి వాసన ఎక్కువగా వస్తే బల్లులు త్వరగా అక్కడినుంచి వెళ్లిపోతాయని చెబుతున్నారు. అయితే వర్షాకాలం రాగానే ఎక్కడ చూసినా నీరు, మురికి పేరుకుపోతాయి. దీనివల్ల అక్కడ పురుగులు, కీటకాలు పెరగడం స్టార్ట్ అవుతుంది. ఈ పురుగులు, కీటకాలను తింటూ ఇంట్లో బల్లులు స్వేచ్చగా తిరుగుతుంటాయి.
ఈ బల్లులు ఇంటిని మురికిగా మార్చేస్తాయి. అలాగే ఆహారపదార్థాలపైకి కూడా వెళుతుంటాయి. అంతేకాదు ఒక్కోసారి ఇవి మనల్ని అనారోగ్యం బారిన కూడా పడేస్తాయి. మీకు తెలుసా? బల్లి మలం, లాలాజలంలో సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియా ఉంటుంది. ఇది ఫుడ్ పాయిజనింగ్ కు కారణమవుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే వంటింట్లో ఉండే బల్లులు ఆహారంలో పడితే ఆహారం విషతుల్యంగా మారి ఆ వ్యక్తి మరణానికి కూడా కారణమవుతుంది. బల్లులను ఇంట్లో నుంచి తరిమికొట్టడంలో పెప్పర్ స్ప్రే చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
దీనిని ఉపయోగించి మీరు చాలా అంటే చాలా సులువుగా మీ ఇంట్లో ఒక్క బల్లి కూడా లేకుండా చేయొచ్చు. ఇందుకోసం నల్ల మిరియాల పొడిని నీళ్లలో కలపండి. ఈ వాటర్ ను స్ప్రే బాటిల్ లో నింపి బల్లులపై చల్లండి. ఈ పేపర్ స్ప్రే బల్లుల శరీరాన్ని చికాకు పెడుతుంది. దీంతో అది మీ ఇంట్లో నుంచి పారిపోతుంది. బల్లులను ఇంట్లోకి రాకుండా చేసే ఈ చిట్కా మన అమ్మమ్మ కాలం నుంచి కొనసాగుతోంది తెలుసా? అవును మీరు నెమలి ఈకలను ఉపయోగించి కూడా ఇంట్లో బల్లులు లేకుండా చేయొచ్చు.
ఇందుకోసం టేప్ సహాయంతో నెమలి ఈకలను గోడలకు అతికించండి. లేదా బల్లులు ఎక్కడైతే ఎక్కువగా ఉంటాయో.. అక్కడ నెమలి ఈకలను పెట్టండి. అవును మనం కూరలో ఉపయోగించే వెల్లుల్లితో కూడా ఇంట్లో ఒక్క బల్లి కూడా లేకుండా చేయొచ్చు.బల్లులను ఇంటి నుంచి తరిమికొట్టాలంటే వెల్లుల్లి మొగ్గలను పొట్టు తీసి బల్లులు ఉండే చోట పెట్టండి. వెల్లుల్లి వాసన బల్లులకు అస్సలు నచ్చదు. దీంతో కొద్ది సేపటికే మీ ఇంట్లో నుంచి బల్లుల్లు పారిపోతాయి.