బాలయ్య.. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్ హిట్లతో టాలీవుడ్ లో సంచలనంగా మారారు. ఆరు పదుల వయస్సులోనూ యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. దీంతో ప్రేక్షకుల నుంచి కూడా బాలయ్య నుంచి రాబోయే చిత్రాలకు భారీ డిమాండ్ పెరిగింది. అయితే బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక ఇప్పుడు అఖండ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు బాలయ్య. బాలకృష్ణ సినిమాలతో పపాటు రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. వీటితో పాటు ఈ మధ్య షాపింగ్ మాల్ ఓపినింగ్స్ లోనూ సందడి చేస్తున్నారు బాలయ్య. తాజాగా బాలకృష్ణ ఏలూరులో సందడి చేశారు. బాలయ్యతో పాటు హీరోయిన్ సంయుక్తమీనన్ కూడా ఏలూరులో సందడి చేసింది.
ఏలూరు నగరంలో కొత్తగా ఏర్పాటు చేసిన నగల దుకాణాన్ని బాలకృష్ణ, హీరోయిన్ సంయుక్తమీనన్ కలిసి ప్రారంభించారు. బాలకృష్ణ, సినీ నటి సంయుక్తను చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కాగా ఈ సందర్భంగా బాలకృష్ణ కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకుంది సంయుక్తమీనన్. బాలయ్య ఆమెను దీర్ఘాయుష్మాన్ భవ అంటూ దీవించారు.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలయ్య గొప్ప మనసు, మా బాలయ్య బంగారం.. అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Back to Hyderabad ❤️❤️ pic.twitter.com/H4AjkWRqlE
— ᴹᵃʰᵃʳᵃᵃʲ Balayya Yuvasena (@BalayyaUvasena) June 13, 2025