డాకు మహారాజ్ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో అదరగొట్టారు. బాబీ ఈ సినిమాను అభిమానుల ఊహకు మించి తెరకెక్కించి సక్సెస్ అయ్యారు. మాస్ ఆడియన్స్ కు కావాల్సిన మసాలా మొత్తం ఈ సినిమాలో దట్టించారు బాబీ. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ తో పాటు మరో భామ కూడా నటించింది ఆమె చాందిని చౌదరి.
అయితే అయితే డాకు మహారాజ్ సినిమాలోని దబిడి దిబిడి సాంగ్ పై సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో ట్రోల్స్ వచ్చాయి. ఆ సాంగ్ లో భాగంగా శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన డ్యాన్స్ స్టెప్పుల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బాలయ్య కేవలం స్టార్ హీరో మాత్రమే కాదని ఆయన ఎమ్మెల్యే అని అలాంటి వ్యక్తితో ఇలాంటి స్టెప్పులు వేయించడం ఏంటని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే డాకు మహారాజ్ మూవీ సక్సెస్ పార్టీ తాజాగా జరగగా ఈ పార్టీలో బాలయ్య, ఊర్వశి రౌతేలాతో దబిడి దిబిడి సాంగ్ కు వేసిన స్టెప్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి.
బాలయ్య ఊర్వశి నడుముపై దబిడి దిబిడి అంటూ స్టెప్పులు వేయగా ఆ స్టెప్పుల విషయంలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చెడుగా అర్థం వచ్చే సైగలతో బాలయ్య ఈ డ్యాన్స్ స్టెప్పులు వేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఇన్ని కామెంట్స్ వస్తున్న ఆ వీడియోను నటి ఊర్వశి రౌతేల్ ఇంస్టాగ్రామ్ షేర్ చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.