బాలయ్య ఎక్కడికెళ్లినా ఆ బ్యాగ్ ఉండాల్సిందే..! ఇంతకీ ఆ బ్యాగ్ లో ఏముంటుందో తెలుసా..?

divyaamedia@gmail.com
1 Min Read

స్టార్ హీరోగా బాలయ్య వెంట ఎప్పుడూ సెక్యూరిటీతో పాటు, వ్యక్తిగత విషయాలు చూసుకునే సిబ్బంది ఉంటారు. ఆయన సామాన్లు మోస్తారు. ఒక బ్యాగ్ మాత్రం బాలకృష్ణ ఎవరికీ ఇవ్వరు. స్వయంగా క్యారీ చేస్తారు. ఆ బ్యాగ్ ప్రత్యేకత ఏమిటీ? అందులో ఏముంటుందనే సందేహం మనకు రావచ్చు. విశ్వసనీయ సమాచారం ప్రకారం బాలకృష్ణ ఆ బ్యాగ్ లో మ్యాన్షన్ హౌస్ బాటిల్ క్యారీ చేస్తారట. అయితే తాజాగా బాలయ్య అటు సినిమాలు, ఇటు పాలిటిక్స్ కాకుండా మరో విషయంలో వైరల్ అవుతున్నారు.

బాలకృష్ణ సినిమాల్లో బాలయ్య బాబుని సింహం అని రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. చాలా సినిమాల్లో పవర్ ఫుల్ సీన్స్ లో బాలకృష్ణని సింహంలా చూపించడం, బాలయ్య పక్కన సింహాలు చూపించడం, ఆయన సినిమా టైటిల్స్ లో సింహ ఉండేలా చేస్తారు. తాజాగా బాలకృష్ణ వేసుకున్న బ్యాగు వైరల్ గా మారింది. ఇటీవల హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లిన బాలకృష్ణ గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగాక భుజాన ఓ బ్యాగు వేసుకొని వెళ్లారు.

అయితే ఆ బ్యాగ్ మీద సింహం తల ఉన్న బొమ్మ ఉంది. గోల్డ్ కలర్ లో బ్యాగ్ అంతా సరిపోయేలా జూలు ఉన్న సింహం ఉంది. బాలయ్య సినిమాల్లో చూపించినట్టే సింహం బొమ్మ ఉండటంతో ఈ బ్యాగ్ వైరల్ గా మారింది. దీంతో సింహమే సింహం బ్యాగు వేసుకొని వెళ్తుంది అని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. మొత్తానికి బాలయ్య తన లయన్ బ్యాగుతో కూడా వైరల్ అవుతున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *