సీఎం చంద్రబాబు హెల్త్‌ సీక్రెట్‌ ఇదే, ఇప్పటికి మెనూలో అది ఉండాల్సిందే..?

divyaamedia@gmail.com
2 Min Read

టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు 70 ఏళ్లు దాటినా ఫిట్ ఉంటారు. 1995 నుండి ఆయన ఆహార అలవాట్లలో మార్పు చేసుకున్నారు. అప్పటి నుండి ఇప్పటివరకు అదే మెనూను పాటిస్తున్నారు. ఏడు పదుల వయస్సు దాటినా ఆయన ఫిట్ గా ఉండడానికి కఠినమైన ఆహారపు అలవాట్లు, యోగా కారణంగా చెబుతున్నారు. అయితే ఏడుపదుల వయస్సులోనూ అన్‌స్టాపబుల్ అంటున్నారు సీఎం చంద్రబాబు. పనిచేస్తే మీకు అలుపొస్తదేమో… నాకు మాత్రం ఊపొస్తదన్న రేంజ్‌లో ఫుల్‌ ఎనర్జీతో కనిపిస్తారు. ఏజ్‌… జస్ట్‌ నెంబర్‌ మాత్రమేనంటూ దూకుడు చూపిస్తున్నారు. గంటలకొద్దీ రివ్యూలు చేసినా… రోజులో ఎన్ని పర్యటనలున్నా… కారులేకున్నా… కాన్వాయ్‌ రాకున్నా… అస్సల్‌ తగ్గేదేలే అన్నట్లుంటారు.

కేవలం ఫిజికల్‌గా ఫిట్‌గా ఉండటమే కాదు… మెంటల్‌గానూ వెరీ స్ట్రాంగ్‌గా కనిపిస్తారు. అయితే ఆయన ఫిట్‌నెస్‌ అండ్‌ పీస్‌ ఆఫ్ మైండ్‌పై ఎన్ని డిబేట్లు నడుస్తున్నా… ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు చంద్రబాబు. ఇక లేటెస్ట్‌గా స్వచ్ఛ ఆంధ్రా ప్రోగ్రామ్‌లో ఆయన చేసిన కామెంట్స్‌… ఆయన ఫిట్‌నెస్‌ మంత్రను తెలియజేసేలా ఉండటం చర్చనీయాంశమైంది. కడప జిల్లా మైదుకూరు మున్సిపాలిటీలో స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం చంద్రబాబు. అందులోభాగంగానే నెలలో మూడో శనివారం స్వచ్ఛ ఆంధ్రాకు కేటాయించాలన్నారు. ప్రతిఒక్కరూ ఆ రోజు స్వచ్ఛ ఆంధ్రలో పాల్గొనాలన్నారు. మార్పే నామార్క్‌ అంటూ సూపర్‌ డైలాగ్‌ పేల్చారు.

తాను వెళ్లి వచ్చినచోట మార్పు ఉండాలి… అలాగే తాను ప్రవేశపెట్టే పథకాలతో మార్పు రావాలన్నారు. అంతేకాదు ప్రతిఒక్కరిలో మార్పు వస్తేనే సమాజం కూడా అద్భుతంగా మారుతుందంటూ స్వచ్ఛ ఆంధ్రా కోసం 5 సూత్రాలను డిజైన్‌ చేసి క్లియర్‌ కట్‌గా ఎక్స్‌ప్లేన్ చేశారు. ఐదు సూత్రాల్లో మొదటిది మైండ్‌ ప్యూరిఫికేషన్‌. అనునిత్యం మైండ్‌ని కంట్రోల్‌ చేసుకోవాలన్నారు చంద్రబాబు. మైండ్‌ కంట్రోల్‌లోకి మనిషి వెళ్తే… ఎన్నో అనార్ధాలు జరుగుతాయన్నారు. ఇక రెండోది బాడీ ప్యూరిపికేషన్‌. ఇష్టానుసారంగా తింటే ఇక అంతే సంగతులంటూ స్వీట్‌ వార్నింగ్‌ ఇచ్చారు.

ఇక ఇంటి శుద్ధితోనే ఆహ్లాదకర వాతావరణమంటూ మూడో సూత్రాన్ని చెప్పారు చంద్రబాబు. ఇళ్లు పరిశుభ్రంగా ఉంటేనే… సమాజం కూడా పరిశుభ్రంగా ఉంటుందన్నారు. ఇక నాలుగోది పరిసరాల పరిశుభ్రత. యస్‌… పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది… మైండ్‌ కూడా షార్ప్‌గా పనిచేస్తుందన్నారు చంద్రబాబు. ఇక లాస్ట్‌ అండ్‌ ఫైనల్‌గా వర్క్‌ప్లేస్‌ నీట్‌గా ఉంటేనే వందశాతం స్వచ్ఛత సాధ్యమన్నారు చంద్రబాబు. ఇక ఈ ఐదు సూత్రాలను ఫాలో అయితే అద్భుతాలు సాధించవచ్చన్నారు చంద్రబాబు.

హెల్తీగా మారడంతోపాటు… మానసిక ప్రశాంతత, సమాజశుద్ధి సాధ్యమవుతుందన్నారు. మొత్తంగా ఈ ఐదు సూత్రాలను బేస్‌ చేసుకుని… చంద్రబాబు ఫిట్‌నెస్‌ అండ్‌ పీస్‌ ఆఫ్‌ మైండ్‌పై చర్చలు జరుగుతున్నాయి. అయన ఆరోగ్యకరమైన జీవితానికి ఈ ఫైవ్‌ ప్రిన్సిపుల్సే కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన పాటించే విషయాలనే అందరిని చెప్పారని… హెల్తీ సొసైటీ-క్లీన్‌ సొసైటీ లక్ష్యంలో భాగంగా ఆయన తూచా తప్పకుండా పాటించే వాటితోనే స్వచ్ఛ-ఆంధ్ర కార్యక్రమాన్ని డిజైన్‌ చేశారంటూ డిబేట్స్‌ నడుస్తున్నాయ్.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *