ప్రతి అత్త, కోడలితో అస్సలు చెప్పకూడని విషయాలు ఇవే.

divyaamedia@gmail.com
2 Min Read

సాధారణంగా ప్రతి ఇంట్లోనూ అత్తాకోడళ్ల మధ్య గొడవలు రావడం అనేది సర్వ సాధారణం. అయితే ఈ గొడవలు పెద్దవైతే ఇంట్లో ఉండే అందరికీ చిరాకు కలిగిస్తుంది. ఎంతో మంది పురుషులు ఇటు తల్లికి, భార్యకు మధ్య సర్దిచెప్పలేక, వాళ్ల సమస్యలు పరిష్కరించలేక సతమతమౌతూ ఉంటారు. అయితే కోడలు ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత ఆమె ఏం చేసినా తప్పులు వెతకడం మంచిది కాదు. అంటే.. మా కాలంలో ఇవన్నీ ఉండేవి కావు. మా ఇంట్లో ఇలాంటివన్నీ చేయడానికి వీలు లేదు. లాంటి మాటలు చెప్పకూడదు. ఎందుకంటే.. కాలంతో పాటు మనుషులు కూడా మారుతూ ఉండాలి.

మీకు కాలం ఉన్నట్లు.. ఇప్పటి కాలం, ఈ కాలం అమ్మాయిలు ఉండరు అనే విషయం కూడా తెలుసుకోవాలి. మీ ఆలోచనలకు తగినట్లు ఈ కాలం అమ్మాయిల ఆలోచనలు ఉండవని తెలుసుకోవాలి. మీ కొడుకును పెళ్లి చేసుకొని, తన కుటుంబాన్ని వదిలేసి మీ ఇంటికి వచ్చిన అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదు. ఆమె ఒక్కసారి మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంది అంటే.. మీ ఇల్లు..తన ఇల్లు కూడా అవుతుంది. ఆ విషయం పట్టించుకోకుండా ప్రతిసారీ కోడలు ఏం చేసినా.. ఇది నీ ఇల్లు కాదు.

కాని పదే పదే అనడం మంచిది కాదు. ఇలాంటి మాటలు ఆమెను బాధపెడతాయి. ఆమె కూడా మీ కుటుంబ సభ్యురాలు అని మరు అంగీకరించాలి. కోడలు ఇంట్లో ఏదైనా పొరపాట్లు చేస్తే.. తల్లిలా క్షమించాలి. అంతేకానీ… నీ పెంపకం సరిగా లేదు, ఇలానేనా మీ పేరెంట్స్ నిన్ను పెంచేది అంటూ ఆమెతో పాటు వాళ్ల పేరెంట్స్ ని కూడా తిట్టడం మంచిది కాదు. ఈ మాటలు పొరపాటున కూడా ఆమెను అనకూడదు. మీ కోడలికి మీ మీద, మీ కొడుకు మీద మర్యాద కూడా తగ్గిపోతుంది.

కుటుంబంలో ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకుంటుంటే.. అదుదలో మీ కోడలికి కూడా మాట్లాడే హక్కు ఉంటుంది అని తెలుసుకోవాలి. అంతేకానీ ఆమె మాట్లాడుతుంటే.. నీకేమీ తెలీదు, నోర్మూసుకో అంటే చెప్పడం మంచిది కాదు. మీ కోడలిని ఏ విషయంలోనూ.. మీ కూతురితో పోల్చడం మంచిది కాదు. పొరపాటున కూడా నా కూతురు అయితే.. ఇలా చేసేది కాదు.. అలా చేసేది అంటూ పొలుస్తూ.. ఇబ్బంది పెట్టకూడదు. ఈ మాటలు కూడా ఆమెను ఇబ్బంది పెడతాయి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *