ఆ చిన్న పొరపాటే ఆర్తి అగర్వాల్ ప్రాణం తీసిందా..! మరణం వెనుక అసలు నిజం ఇదే.

divyaamedia@gmail.com
1 Min Read

‘నువ్వు నాకు నచ్చావ్’ అంటూ 16 ఏళ్ల వయసులో టాలీవుడ్ వెండితెరపై సందడి చేసింది. తొలి సినిమాతోనే భారీ విజయాన్ని అందుకుంది. ఇంకేముంది.. ఆమె ముందు వరుస అవకాశాలు క్యూకట్టాయి. మొదటి సినిమాతోనే స్టార్ హీరో విక్టరీ వెంకటేష్‏తో జతకట్టిన ఆర్తి… ఆ తర్వాత ప్రభాస్, మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున, తరుణ్, మహేష్ బాబు, బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజ వంటి అగ్ర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది.

అయితే చిన్న వయసులోనే స్టార్ డమ్ అందుకున్న ఈ హీరోయిన్.. వ్యక్తిగత జీవితం మాత్రం అంత సజావుగా సాగలేదు. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే ప్రేమ, పెళ్లి , బ్రేకప్ అంటూ ఎన్నో రూమర్స్ వినిపించాయి. అమే మానసిక ఒత్తిడిలో 2005లో క్లీనింగ్ కెమికల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆ తర్వాత ఏడాది మెట్లపై నుంచి పడిపోయింది.

2007లో న్యూజెర్సీకి చెందిన ఉజ్వల్ నికమ్ ను పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత వ్యక్తిగత కారణాలతో విడాకులు తీసుకుంది. ఇటు సినిమాల్లోనూ అవకాశాలు తగ్గిపోయాయి. కొన్నాళ్లలకు రీఎంట్రీ ఇచ్చిన పెద్దగా వర్కవుట్ కాలేదు. అప్పటికే బరువు ఎక్కువగా పెరగడంతో ఆమెకు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. బరువు తగ్గేందుకు తీసుకున్న చిన్న నిర్ణయమే ఆమె ప్రాణాలను తీసింది.

స్థూలకాయం, శ్యాసకోస సమస్యలతో బాధపడిన ఆర్తి.. 2015 జూన్ 4న అమెరికాలోని అట్లాంటిక్ సిటీలో లైపోసక్షన్ సర్జరీ చేయించుకుంది. కానీ ఆ సర్జరీ ఫెయిల్ కావడంతో గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయింది. ఇప్పటికీ తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన అందమైన రూపం.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *