విడాకులు తీసుకునే సెలెబ్రేట్స్ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే ఈ విషయాన్ని కొందరు అధికారికంగా ప్రకటిస్తుంటే.. మరికొందరు మాత్రం వారి విడాకుల విషయాన్నీ అధికారికంగా చెప్పనప్పటికీ ఇన్ డైరెక్ట్ గా హింట్స్ ఇస్తున్నారు. తమ సోషల్ మీడియా ఖాతాలలో భాగస్వామితో కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలను తొలగిస్తూ విడాకుల రూమర్స్ కి ఓ హింట్ ఇస్తున్నారు. అయితే సౌత్ ఇండియాలో మంచి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న అపర్ణ వినోద్ విడాకులు తీసుకోనుంది.
మలయాళ, తమిళ సినిమాల్లో తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్న ఈ నటి, పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. భర్త రినిల్ రాజ్ తో విడిపోతున్నట్లు ఆమే స్వయంగా ప్రకటించింది. 2022 అక్టోబర్‌లో అపర్ణ, రినిల్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. 2023 ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున వీరి వివాహం గ్రాండ్‌గా జరిగింది. కేరళలోని కోజికోడ్‌లో హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి జరిగింది. ఈ వేడుకకు దగ్గరి బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు.
తర్వాత రెండేళ్లు సవ్యంగా సాగిన వీరి ప్రేమ కాపురం..ఇప్పుడు తెగదెంపులు చేసుకోవడం అందర్ని షాక్ కు గురి చేసింది. అపర్ణ ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో ఎమోషనల్‌గా స్పందిస్తూ, ‘నా పెళ్లి జీవితం కష్టంగా, ఒత్తిడితో కూడుకున్నదిగా గడిచింది. అందుకే ఈ అధ్యాయాన్ని ముగించడం నాకు చాలా ముఖ్యం. ఇది నా వ్యక్తిగత ఎదుగుదల కోసం తీసుకున్న నిర్ణయం’ అని పేర్కొంది. తన అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ‘మీరు నాపై చూపించిన ప్రేమకు, మద్దతుకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో, సానుకూలంగా ముందుకు సాగుతాను’ అని తెలిపింది.
అపర్ణ వినోద్ 2015లో ‘న్జన్ నిన్నోడు కూడేయుండు’ అనే మలయాళం సినిమాతో మూవీ ఇండస్ట్రీలోకి ప్రవేశించింది. అదే ఏడాది ‘కోహినూర్’ సినిమాలో ఆసిఫ్ అలీతో కలిసి నటించి గుర్తింపు తెచ్చుకుంది. 2017లో విజయ్ హీరోగా వచ్చిన ‘భైరవా’ సినిమాతో తమిళ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. కీర్తి సురేష్ కూడా హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో అపర్ణకు మంచి పేరు వచ్చింది. ఆమె నటించిన చివరి సినిమా ‘నడువన్’. ఇది 2021లో విడుదలైంది. సినిమాలతో పాటు, అపర్ణ స్టేజ్ ఆర్టిస్ట్‌గా కూడా రాణించింది. కాలికట్ యూనివర్సిటీ ఆర్ట్స్ ఫెస్టివల్స్‌లో ఇంగ్లీష్ డ్రామాల్లో నటించి అవార్డులు గెలుచుకుంది.