తమ కలల హీరోయిన్ ఒక వేశ్య పాత్రలో నటిస్తే ఆమె అభిమానులు కళ్లప్పగించి చూశారు. ఆమె పోస్టర్ ప్రదర్శిస్తే రోడ్డుపై భారీ ప్రమాదాలు సంభవించాయి. అంతటి క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ అనుష్క శెట్టి. అయితే ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమను ఏలిన హీరోయిన్లలో అనుష్క ఒకరు.
గ్లామరస్ హీరోయిన్ గా.. ఇటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ అదరగొట్టింది. కథ, పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ తనదైన ముద్ర వేసింది. బాహుబలి సినిమా తర్వాత సినిమాలు తగ్గించింది. ప్రస్తుతం ఘాటీ చిత్రంలో నటిస్తుంది అనుష్క. ఇదిలా ఉంటే.. అనుష్క కెరీర్ లో బాగా గుర్తుండిపోయే సినిమాల్లో వేదం ఒకటి. కెరీర్ పీక్స్ లో ఉండగానే ఈ సినిమాలో వేశ్య పాత్రలో కనిపించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

డైరెక్టర్ క్రిష్ జాగర్లముడి తెరకెక్కించిన ఈ సినిమాలో అల్లు అర్జున్, మంచు మనోజ్ నటించారు. అయితే ఈ సినిమా సమయంలో ఓ ఆసక్తికర సంఘటన జరిగిందట. వేదం సినిమా నుంచి అనుష్క పసుపు చీర కట్టుకుని వెనక్కి తిరిగి చూస్తున్న స్టిల్స్ ప్రమోషన్స్ కోసం వాడారు. హైదరాబాద్ లో పలు చోట్ల హోర్డింగ్స్ పెట్టారట. పంజాగుట్ట సర్కిల్ లోనూ పెద్ద హోర్డింగ్ పెట్టారట.
అందులో అనుష్కను చూస్తూ చాలా యాక్సిడెంట్స్ జరిగాయట. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 40 యాక్సిడెంట్స్ వరకు జరిగాయట. పెద్ద యాక్సిడెంట్స్ కాదు.. హోర్డింగ్ చూస్తూ ముందు ఉన్న వాహనాలను ఢీకొట్టేవారట. దీంతో పోలీసులు రంగంలోకి దిగి అనుష్క హోర్డింగ్ తొలగించారట.