వేల కోట్ల ఆస్తి ఉన్న హీరోలలో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఒకరు. ఆయన హీరోగా ఎంత స్టార్ డమ్ చూశారో..వ్యాపారవేత్తగా కూడా అంతే ఎదిగారు. ఇటు హీరోగా నటిస్తూనే.. అటు తన వ్యాపార సాంమ్రాజ్యాన్ని పెంచుకుంటూ వెళ్లారు.. సినిమా స్టూడియోతో పాటు.. సినిమా నిర్మాణం, కన్వెన్షన్ సెంటర్లు, ఇతర రంగాల్లో పెట్టుబడులు, హోటల్స్…. టీవీ ఛానల్స్, ఇలా నాగార్జున చేయి వేయని రంగం లేదేమో..! అయితే ఫిల్మ్ స్టూడీయో అనగానే హైదరాబాద్‌లో అందరికి ముందుగా గుర్తొచ్చేది అన్నపూర్ణ స్టూడీయోస్.
ఇన్ డోర్ షూటింగ్‌లు దాదాపుగా జరిగేవి ఇక్కడే. మరీ ముఖ్యంగా బుల్లితెరపై వచ్చే షోలు దాదాపుగా ఇక్కడే షూట్ జరుపుకుంటుంటాయి.హైదరాబాద్ మధ్యలో దాదాపు 22 ఎకరాల్లో ఉన్న అన్నపూర్ణ స్డూడియోస్‌లో గ్యాప్ లేకుండా షూటింగ్‌లు జరుగుతూనే ఉంటాయి. ఇక మొదటి తరం హీరో అక్కినేని నాగేశ్వరరావు ఈ స్టూడియోస్‌ను స్థాపించాడు. అప్పట్లో ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం మద్రాసులో ఉండేది. షూటింగ్‌లన్నీ అక్కడే జరిగేవి.
అలాంటి టైమ్‌లో హైదరాబాద్‌లో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీనీ డెవలప్ చేయాలని ఆలోచనలో పడ్డాడు నాగేశ్వరరావు. అనుకున్నదే తడువుగా… 1973 నాటి సీఎం జలగం చెంగలరావు గారితో ఈ విషయంపై టాలీవుడ్ అగ్ర హీరోలు చర్చలు జరపారు. అలా సీఎం చొరవ చేసి హైదరాబాద్‌లో స్థలం కేటాయించాడు. దాంతో.. ఏఎన్నార్ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత మెల్లి మెల్లిగా.. తెలుగు ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్‌కు వచ్చేసింది. ఆ తర్వాత ఇక్కడ నిర్మాణం ఊపందుకుంది.
ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు పలు ఇండస్ట్రీ సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇక ఇదిలా ఉంటే.. ప్రస్తుతం దీని వాల్యూ ఎంత అని అందరిలో ఓ అమితాసక్తి నెలకొంది. ఇన్ సైడ్ రిపోర్ట్స్ ప్రకారం.. అన్నపూర్ణ స్టూడియోస్ విలువ అక్షరాల రూ.1000 కోట్లు ఉంటుందని వినిపిస్తుంది. అంతేకాకుండా 2011లో నాగార్జున ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రారంభించాడు. అది కూడా సూపర్‌గా సక్సెస్ అయింది. మొత్తానికి నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ ద్వారా ప్రతీ నెల కోట్లు సంపాదిస్తున్నాడని వినిపిస్తుంటాయి.