గత కొంతకాలంగా అంజలి తల్లికి ఆరోగ్యం బాగోలేదు. ఈ విషయాన్ని తన యూట్యూబ్ ఛానల్‌కి సంబంధించిన ఓ వీడియోలో అంజలి చెప్పింది. “అమ్మకి లంగ్స్ కెపాసిటీ పూర్తిగా తగ్గిపోయింది.. దీంతో ఆసుపత్రిలో జాయిన్ చేశాం. చాలా డబ్బు కూడా ఖర్చైంది.
అయితే “అమ్మా… నువ్వు లేని లోటు మాటల్లో చెప్పలేను. నీ నవ్వు, నీ మాటలు, నీవిచ్చిన ప్రేమ ఇవన్నీ ఇక జ్ఞాపకాలుగా మాత్రమే మిగిలిపోయాయి. కాలం నిన్ను మా నుంచి దూరం చేసినా, మా హృదయం మాత్రం నిన్ను ఎప్పటికీ దూరం చేయలేదు. నీ ఆశీస్సుల వెలుగు ఎల్లప్పుడూ మా జీవితాలను దారి చూపిస్తుంది.
అమ్మా… నీ ఆత్మకు శాంతి కలగాలి” అంటూ అంజలి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ చూసిన పలువురు టీవీ, సినిమా ప్రముఖులు, నెటిజన్లు అంజలికి సంతాపం తెలియజేస్తూ “ఓం శాంతి” అంటూ కామెంట్లు చేస్తున్నారు. గత కొంతకాలంగా అంజలి తల్లికి ఆరోగ్యం బాగోలేక పోయిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని కూడా అంజలి స్వయంగా వెల్లడించారు.
“అమ్మకు లంగ్స్ కెపాసిటీ పూర్తిగా తగ్గిపోయింది. దాంతో ఆసుపత్రిలో అడ్మిట్ చేయాల్సి వచ్చింది. చికిత్స కోసం చాలా డబ్బు ఖర్చైంది. డిశ్చార్జ్ అయిన తర్వాత మాత్రం మళ్లీ కిందపడిపోయి తై బోన్ విరిగిపోయింది. మళ్లీ హాస్పిటల్‌లో చేర్చాల్సి వచ్చింది,” అని అంజలి తెలిపిన విషయం ఇప్పుడు మరింత భావోద్వేగంగా మారింది.