టాలీవుడ్లో టాప్ మేల్ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ప్రదీప్ అడపా దడపా అవకాశాలు వస్తే సినిమాల్లో కూడా కనిపిస్తుంటాడు. ప్రదీప్ యాంకరింగ్ నొప్పించక, తానొవ్వక అన్నట్లు కామెడీ కిక్కిస్తుంటాయి ఆడియన్స్‌కి. ప్రదీప్ గత కొంత కాలంగా నవ్య మారోతుతో ప్రేమాయణం నడిపిస్తున్నట్లు టాక్. అయితే యాంకర్ ప్రదీప్ పెళ్లి కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు.
గతంలో చాలా సార్లు ప్రదీప్ పెళ్లి పై వార్తలు వచ్చాయి. కానీ వాటికి అతను రెస్పాండ్ అవ్వలేదు. దాంతో ఆ వార్తల్లో నిజం లేదని అయన ఫ్యాన్స్ కొట్టి పడేసారు.. అయితే ఇప్పుడు మరోసారి ఆ వార్తలు ఊపందుకున్నాయి.. ఏపీకి చెందిన ఒక ఎమ్మెల్యే కూతురితో యాంకర్ ప్రదీప్ రహస్యముగా ప్రేమలో ఉన్నాడని ఇండస్ట్రీలో, పొలిటికల్ వర్గాల్లో ఒక టాక్ వినిపిస్తున్నది.
ఆ అమ్మాయి చదువు కోసం ఇన్ని రోజులు ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టలేదట. ఇప్పుడు వీరిద్దరూ ఇరు కుటుంబాల వారికి ప్రేమ విషయం చెప్పడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. దాంతో త్వరలోనే పెళ్లి భాజాలు మోగనున్నాయని టాక్.. ఇక ప్రదీప్ తండ్రి ఇటీవల అనారోగ్యంతో చనిపోయారు. పెళ్లి బాధ్యతలను తన తల్లి దగ్గరుండి చూసుకోనుందని సమాచారం. మరి ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియదు.. ప్రదీప్ స్పందిస్తేనే క్లారిటీ రానుంది.
ఏది ఏమైనప్పటికి ప్రదీప్ పెళ్లి కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ప్రదీప్ వరుస షోలు చేసి ఫుల్ క్రేజ్ సంపాదించుకోవడంతో పాటు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. అటు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడు.