ఈ టాలీవుడ్ యాంకర్‌ను గుర్తు పట్టారా..? ఎలా మరిపోయిందో చుడండి.

divyaamedia@gmail.com
1 Min Read

అద్భుతమైన అందాలు కల్గిన ఈమె అంతకు మించిన స్పాంటేనియస్ తో టాలెంటెడ్ యాంకర్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు ప్రేక్షకులు మెచ్చే అతికొద్ది మంది యాంకర్లలో ఈ ముద్దుగుమ్మ కూడా చేరిపోయింది. అయితే గత కొన్నేళ్లుగా ఏ టీవీ షోలోనూ కనిపించడం లేదీ అందాల యాంకరమ్మ. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది.

అలాగే సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ను కూడా రన్ చేస్తోంది. తన పిల్లలు, భర్తతో కలిసి వీడియోలు చేస్తూ ట్రెండింగ్ లో ఉంటోంది. అలా తాజాగా ఈ యాంకరమ్మ చేసిన కొన్ని ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇందులో ఆమె బిడ్డను చంకలో పెట్టుకుని ఇటుకలు మోస్తూ కనిపించింది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యానికి లోనయ్యారు.

ఈ స్టార్ యాంకరమ్మకు ఏమైంది అని కామెంట్స్ పెట్టారు. అయితే ఆ తర్వాత విషయం తెలుసుకుని కూల్ అయ్యారు. మరీ ఈ యాంకరమ్మ ఎవరో గుర్తు పట్టారా? యస్. ఆమె మరెవరో కాదు ఏనుగు, చీమ జోకులతో ఆడియెన్స్ ను నవ్వించిన లాస్య. ఇక ఈ ఫొటోలు, వాటి వెనక ఉన్న అసలు కథేంటో తెలుసుకుందాం రండి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దేవీ నవరాత్రులు ఘనంగ జరుగుతున్నాయి.

కాగా కొన్ని ప్రాంతాల్లో అమ్మవారి రూపానికి తగినట్లుగా తొమ్మిది రోజులూ తొమ్మిది రంగుల దుస్తులను ధరించి భక్తులు దుర్గామాతను పూజిస్తారు. ఈ క్రమంలోనే యాంకర్ లాస్య కూడా తన దైన విధానంలో నవరాత్రి ఉత్సవాలను జరుపుకొంది. ఒక్కో రోజూ ఒక్కో కలర్ దుస్తులు ధరిస్తూ వాటి వెనక ఉన్న ప్రాశస్త్యాన్ని నెటిజన్లతో పంచుకుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *