అందరిలా తాను ఎందుకు ఉండాలని భావించిందో ఏమో తెలియదు కాని బాలీవుడ్ హీరోయిన్ విచిత్రంగా ఆలోచించింది. సాధారణంగా ఎవరైన పెళ్లి తర్వాత ఎఫైర్ పెట్టుకుంటే పెళ్లి ఒకరితో .. సంసారం మరొకరితో అనే మాట మనం తరుచూ వింటుంటాం. అయితే ఇప్పుడు ఈ బ్రిటిష్ నటి విదేశాల్లో స్థిరపడింది. అమీ జాక్సన్ 2015 నుండి 2021 వరకు హోటల్ వ్యాపారి జార్జ్ పనాయోటౌతో రిలేషన్‌షిప్ కొనసాగించింది. 2019లో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే అదే సంవత్సరం అమీ ఒక ఆడబిడ్డను ప్రసవించింది. అప్పటికింకా వారికి పెళ్లి కాలేదు.
కానీ 2021లో అమీ, జార్జ్ విడిపోయారు. ఆ తర్వాత ఆమె ఆంగ్ల నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌తో డేటింగ్ ప్రారంభించింది. గతేడాది ఆగస్టులో పెళ్లి కూడా చేసుకుంది. ఆ తర్వాత అక్టోబర్‌లో తాను మరోసారి గర్భం ధరించినట్లు ప్రకటించింది అమీ. ఇప్పుడు ఏకంగా బికినీలో తన బేబీ బంప్‌ని చూపిస్తూ కొత్త ఫోటోలను షేర్ చేసిందీ అందాల తార. పూల్ ముందు నగ్నంగా నిలబడిన ఫొటోలు షేర్ చేసిన అమీ జాక్సన్.. ‘దీన్నిప్పుడు స్కిన్నీ డిప్పింగ్ అనలేం’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అమీ జాక్సన్ షేర్ చేసిన బేబీ బంప్ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరలవుతున్నాయి.
వీటిని చూసిన నెటిజన్లు భిన్న రకాలుగా స్పందిస్తున్నారు. కొంత మంది కంగ్రాట్స్ చెబుతుంటే మరికొందరు మాత్రం విమర్శిస్తున్నారు. ఇలా నగ్నంగా కాకుండా మాములుగా కూడా ప్రెగ్నెన్సీ అనుభూతులు పంచుకోవచ్చని హీరోయిన్ కు సూచిస్తున్నారు. 2010లో ‘మదరాసపట్నం’ అనే తమిళ సినిమాతో అమీ జాక్సన్ సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత పలు దక్షిణాది చిత్రాల్లో నటించి మెప్పించింది. అయితే ప్రస్తుతం చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటోంది అమీ జాక్సన్. విదేశాల్లో సెటిల్ కావడంతో కొత్త సినిమాలు ఒప్పుకోవడం లేదు. ప్రస్తుతం ఆమె లండన్‌లో ఉంటున్నట్లు సమాచారం. అన్నట్లు ఆమె మోడల్ కూడా.