ఎన్నో సినిమాల్లో నటించి తమదైన నటనతో మెప్పించిన సినీతారల వ్యక్తిగత జీవితాల గురించి నిత్యం ఏదోక వార్త వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా సెలబ్రెటీల ప్రేమ, డేటింగ్ విషయం గురించి చెప్పక్కర్లేదు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ తన ప్రియుడిని పరిచయం చేసింది. అయితే తెలుగు హీరోయిన్ అమీషా పటేల్. సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన నాని సినిమాతో తెలుగులో స్టార్ స్టేటస్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో నటించింది. 2000లో విడుదలైన ‘కహో నా ప్యార్ హై’ చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
అమీషా కెరీర్ అద్భుతంగా ప్రారంభమైంది. ‘కహో నా ప్యార్’ సినిమా తర్వాత నటిగా నటించిన ‘గదర్: ఏక్ ప్రేమ్ కథ’ హిట్ అయింది. చాలాకాలం సినిమాలకు దూరంగా ఉన్న అమీషా.. ఇటీవలే గదర్ 2 సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. అమీషా వయసు ప్రస్తుతం 49 సంవత్సరాలు. ఇప్పటికీ ఆమె ఒంటరిగానే ఉంది. అయితే కొన్నిరోజులుగా ఆమె పేరు పాకిస్థానీ నటుడు ఇమ్రాన్ అబ్బాస్ తో ముడిపడి ఉంది. వీరిద్దరు ప్రేమలో ఉన్నారనే టాక్ వినిపిస్తుంది. తాజాగా ఈ రూమర్స్ పై స్పందించింది అమీషా.ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. “ఇవి కేవలం రూమర్స్ మాత్రమే.
అందులో ఎలాంటి నిజంలేదు. గత రెండు మూడేళ్లుగా మా రిలేషన్ షిప్ గురించి వినిపిస్తున్నాయి. మేము ఈవెంట్లలో కలుస్తుంటాము. మంచి స్నేహితులం. విదేశాల్లో ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే అక్కడ కలుస్తాం. ఇద్దరు వ్యక్తులు తరచూ కలుస్తూ మంచిగా కనిపిస్తే వెంటనే రూమర్స్ స్టార్ట్ అవుతాయి. నేను సింగిల్.. అతడు సింగిల్. కాబట్టి మా ఇద్దరి పెళ్లి జరుగుతుందని వార్తలు వ్యాపిస్తాయి. కానీ అలాంటి రూమర్స్ నిజం కాదు” అంటూ చెప్పుకొచ్చింది.
దీంతో అమీషా తన ప్రేమ, పెళ్లి గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చేసింది. ఇమ్రాన్ అబ్బాల్ ఒక పాకిస్థానీ నటుడు. బుల్లితెరపై అతడు చాలా ఫేమస్. ఇమ్రాన్ బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ వర్క్ చేశాడు. అతడు 2014లో విడుదలైన ‘క్రియేచర్ 3డి’ చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. అతనికి పాకిస్థాన్లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.