అమీషా పటేల్.. తెలుగు సినీప్రియులకు పరిచయం అవసరంలేని పేరు. మహేష్ బాబు నటించిన నాని సినిమా హీరోయిన్. నటనలోనే కాదు.. చదువులోనూ అమీషా పటేల్ సూపర్ టాలెంటెడ్. ఆమె ఆర్థిక శాస్త్రంలో గోల్డ్ మెడల్ సాధించింది. ముంబైలోని కేథడ్రల్, జాన్ కానన్ స్కూల్‌లో చదువుకుంది.
ఆ తర్వాత అమెరికాలోని బోస్టన్‌లోని టఫ్ట్స్ విశ్వవిద్యాలయంలో చేరి 2 సంవత్సరాలు బయో-జెనెటిక్స్ చదివిన తర్వాత ఆర్థిక శాస్త్రంలోకి మారింది. ఎకానామిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించింది. అమీషా పటేల్ 2000 సంవత్సరంలో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. హృతిక్ రోషన్ నటించిన కహో నా ప్యార్ హై సినిమాతో నటిగా వెండితెరకు పరిచయమైంది.

ఫస్ట్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమె పేరు మారుమోగింది. అయితే ఒకప్పుడు అందమైన పర్ఫెక్ట్ ఫిగర్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్న ఈ చిన్నది.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ముఖంలో చాలా మార్పులు వచ్చాయి అని ముసలి వాళ్ళ లాగా కనిపిస్తున్నారు అని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.
తాజాగా ఒక ఈవెంట్ లో దర్శనమిచ్చిన ఈమె అక్కడ బ్లాక్ అవుట్ ఫిట్ లో అందరినీ ఆకట్టుకుంది. కానీ ఆమె లుక్స్ ఏ మాత్రం బాగోలేదని అభిమానులు కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి కొంతమంది అమీషా పటేల్ ఏంటి ఇలా మారిపోయింది అంటూ తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉండడం గమనార్హం.