రాజులు, మహారాజులు వ్యాపారులుగా, సామాన్యులుగా వేషాలు వేసుకుని సొంత రాజ్యంలో వీధుల్లో తిరిగేవారు. ఇప్పుడు అదంతా కుదరదు కానీ కొందరు నటీనటులు, క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీలు అప్పుడప్పుడూ గెటప్స్ మార్చుకుని జనాల మధ్య తిరుగుతున్నారు. సినిమా వాళ్ళు గెటప్స్ మార్చుకొని థియేటర్స్ కు వెళ్లి సినిమాలు చూడటం అప్పుడప్పుడు మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం. ఇలా గెటప్స్ మార్చుకోవడం వల్ల ప్రజలను దగ్గరగా చూడటం. వారితో మాట్లాడే అవకాశం సెలబ్రెటీలకు లభిస్తుంది. ఇటీవల, ఒక సూపర్ స్టార్ ముంబై వీధుల్లో రాతి యుగపు వ్యక్తిగా వేషంధరించి తిరిగాడు.
అయితే బాలీవుడ్ స్టార్ హీరో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాడు. దీనికి కారణం ఆతని వేషధారణ. అడవి మనిషిలా వేషం వేసుకుని ముంబై వీధుల్లో తిరిగాడీ స్టార్ హీరో. అంతేకాదు రోడ్లపై డ్యాన్స్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆమిర్ బిచ్చగాడి వేషం వేసుకుని ముంబై వీధుల్లో తిరుగుతుంటే చాలా మంది గుర్తు పట్టలేకపోయారు. అతని ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అసలు విషయం వెల్లడైంది. దీంతో అరే.. ఆమిర్ ఖాన్ ను కలిసే అవకాశం చేజారిపోయిందేంటూ కొందరు బాధ పడుతున్నారు.
అయితే ఆమిర్ ఖాన్ ఉన్నట్లుండి ఇలా రోడ్లపై గల కారణం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న కొందరు అభిమానులు స్టార్ హీరో పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమిర్ ఖాన్ ఇప్పుడు అనేక బ్రాండ్లను ప్రమోట్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే అతను ఇప్పుడు ఇలా వేషం వేశారు. కోకా కోలా ఇండియా ‘ఛార్జ్డ్’ అనే డ్రింక్‌ని ఇంట్రడ్యూస్ చేసింది. కంపెనీ తన ప్రమోషన్ కోసం ఆమిర్ ఖాన్‌ను ఉపయోగించుకుంది. ఈ యాడ్ లో భాగంగా ‘ఛార్జ్డ్ డ్రింక్ తాగిన తర్వాత డ్యాన్స్ చేసే విధంగా విభిన్నంగా చూపించారు. ఈ విషయం తెలుసుకున్న సినీ అభిమానులు, నెటిజన్లు ఆమిర్ ఖాన్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. ‘సినిమా కూడా కాదు.
ఓ యాడ్ కోసం ఇలా చేయడం తగదు’ అంటూ నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఈ కాన్సెప్ట్‌ని ఇష్టపడ్డారు. బ్రాండ్‌కు గొప్ప ప్రమోషన్ వచ్చిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా ‘లాల్ సింగ్ చద్దా’ సినిమా పరాజయం తర్వాత ఆమిర్ ఖాన్ సైలెంట్ అయ్యాడు. నటన నుంచి కాస్త విరామం తీసుకున్నాడు. ఇప్పుడు అతని పూర్తి దృష్టి ‘సితారే జమీన్‌పర్’ సినిమాపైనే. ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. దీంతో పాటు గజిని 2 కూడా తీసే ప్లాన్ లో ఆమిర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇటీవల తండేల్ ఈవెంట్ లో అల్లు అరవింద్ చేసిన కామెంట్స్ దీనికి బలాన్నిస్తున్నాయి.