సినిమాల్లో సహజత్వం కలిగిన పాత్రల కోసం అనేక సాహసాలు చేస్తారు. జుట్టు, గడ్డం పెంచడం, బరువు పెరగడం వంటి ఎన్నో త్యాగాలు చేస్తుంటారు. తాజాగా, ఒక హీరో తన బిచ్చగాడిలా మారి చూపించాడు.కరోనా ముందు, రాజులు, మహారాజులు, వ్యాపారులు తమ సామాన్యుల పరిస్థితిని అర్ధం చేసుకోవడానికి వీక్షణలు వేసుకుని వీధుల్లో తిరిగేవారు. అయితే క్రీడా రంగానికి చెందిన సెలబ్రిటీలు అప్పుడప్పుడూ గెటప్స్ మార్చుకుని జనాల మధ్య తిరుగుతున్నారు. సినిమా వాళ్ళు గెటప్స్ మార్చుకొని థియేటర్స్ కు వెళ్లి సినిమాలు చూడటం అప్పుడప్పుడు మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం.
ఇలా గెటప్స్ మార్చుకోవడం వల్ల ప్రజలను దగ్గరగా చూడటం. వారితో మాట్లాడే అవకాశం సెలబ్రెటీలకు లభిస్తుంది. మొన్నామధ్య ఒక సూపర్ స్టార్ ముంబై వీధుల్లో రాతి యుగపు వ్యక్తిగా వేషంధరించి తిరిగాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. రాతి యుగానికి చెందిన మనిషిలా పొడవాటి గడ్డం, పొడవాటి జుట్టుతో ఒక వ్యక్తి తన శరీరానికి జంతువుల చర్మాన్ని చుట్టి, కాళ్ళకు బూట్లు ధరించి ముంబైలోని రద్దీ వీధుల్లో తిరుగుతూ కనిపించాడు. బిచ్చగాడిలా హ్యాండ్‌కార్ట్‌ను లాగుతూ.. రోడ్‌సైడ్ షాపులకు వెళ్లి ఆహారం అడిగాడు. ఆ వ్యక్తి అవతారం చూసిన కొందరు పారిపోయారు.
బిచ్చగాడిలా మారి జనాల్లో తిరిగిన ఆయన భారతదేశంలోని సూపర్ స్టార్స్ లో ఒకరు. అయన ఎవరో కాదు ఇండియన్ సినిమా స్టార్ యాక్టర్, మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ గా పేరు తెచ్చుకున్న అమీర్ ఖాన్. అమీర్ బిచ్చగాడు వేషం వేసుకుని ముంబై వీధుల్లో తిరిగాడు. తొలుత ఈ వీడియో వైరల్‌గా మారడంతో ముంబై వీధుల్లో ఎవరో విచిత్రమైన వ్యక్తి సంచరిస్తున్నాడని భావించారు. అయితే అమీర్ ఖాన్ మేకప్ వేసుకుంటున్న వీడియో, చిత్రాలు బయటకు వచ్చిన తర్వాతే ముంబై వీధుల్లో అలా తిరిగే అమీర్ ఖాన్ అని తెలిసింది.
అయితే అమీర్ ఖాన్ ఇలాంటి వింత వేషధారణలో ముంబై వీధుల్లో ఎందుకు తిరుగుతున్నాడో ఎవరికీ తెలియదు. అది సినిమా కోసమని కొందరు అంటున్నారు. మరికొందరు అది ఏదో ప్రకటన కోసం కావచ్చునని కామెంట్స్ చేస్తున్నారు. గతంలోనువు అమీర్ ఖాన్ మారువేషాలు వేసుకుని నగరాల వీధుల్లో తిరిగాడు. గతంలో మారువేషంలో సౌరవ్ గంగూలీ ఇంటికి అమీర్ ఖాన్ వెళ్లాడు.
To Ye Caveman Amir Khan Tha BC 😲😲
— POSITIVE FAN (@imashishsrrk) January 29, 2025
But Why ? pic.twitter.com/fRgDB6cEhr