భారతీయ ఆచారాలు, సంస్కృతి ఉట్టిపడేలా వివాహం జరిపించిన పూజారి గురించి హాట్ టాపిక్ నడుస్తోంది. అంబానీ వివాహం జరిపించిన పండితుడు ఎవరు? అయనకు ఎంద దక్షిణ సమర్పించుకుని ఉంటారనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక వ్యక్తి గురించి విపరీతంగా వైరల్ అవుతోంది. ఆయన మరేవరో కాదు.. శాస్త్రయుతంగా అనంత్ అంబానీ వివాహ వేడుక నిర్వహించిన పురోహితుడు. ఇంతకు ఎవరా వ్యక్తి.. మరి అంబానీ కుటుంబం ఆయనకు దక్షిణగా ఎంత భారీ మొత్తం ఇచ్చింది అనే దానిపై నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది. ఆ వివరాలు. ఎంతో అంగరంగ వైభవంగా.. సాంప్రదాయబద్దంగా జూలై 12, శుక్రవారం నాడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల పెళ్లి వేడుక జరిగింది.
ఈ పవిత్ర క్రతువును ఎంతో శాస్త్రయుక్తంగా నిర్వహించిన వ్యక్తి పేరు పండిట్ చంద్రశేఖర్ శర్మ. అంబానీ కుటుంబంలో నిర్వహించే పెద్ద పెద్ద పూజా కార్యక్రమాలు, శుభకార్యాలు అన్నింటిని ఈయన చేతుల మీదుగానే నిర్వహిస్తారు. ఇక చంద్రశేఖర్ పండిట్ విషయానికి వస్తే.. ఆయన పుజారి మాత్రమే కాక ప్రముఖ జ్యోతిష్యుడు కూడా. పెళ్లికి ముందు గుజరాత్ జామ నగర్‌లో నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ వేడుకలకు కూడా చంద్రశేఖర్ శర్మ హాజరయ్యారు. విమానాశ్రయంలో అంబానీ కుటుంబ సభ్యులు ఆయనకు స్వాగతం పలికిన వీడియో వైరల్ అయిన సంగతి తెలిసిందే.
అలాగానే ముఖేష్ అంబానీ నివాసం యాంటిలియాలో జరిగే ప్రతి చిన్న వేడుక, వినాయక చవితి పూజ ఇవన్ని చంద్రశేఖర్ శర్మ గారే నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆయనే స్వయంగా తన ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. కొన్ని ఏళ్ల క్రితం ముంబై ఇండియన్స్ ఫ్యామిలీ పిక్‌లో చంద్రశేఖర్ శర్మ కనిపించడం అప్పట్లో సంచలనంగా మారింది. ఇక ఈ ఫొటోలో నీతా, ఆకాశ్, రాధిక మర్చంట్, అనంత్ అంబానీ కూడా ఉన్నారు. ఇక చంద్రశేఖర్ శర్మ విషయానికి వస్తే.. ఆయన కేవలం జ్యోతిష్యుడు, పూజారి మాత్రమే కాక.. పర్సనల్ కోచ్, లైఫ్‌స్టైల్ మోటివేటర్ అని ఆయన ఫేస్‌బుక్ ప్రొఫైల్ చెబుతుంది.
అంతేకాక ఆయనకు సొంతంగా పూజహోమ అనే వెబ్‌సైట్ కూడా ఉంది. సాధారణంగా పండిట్ చంద్రశేఖర్ శర్మ.. వివాహాది శుభకార్యాలను నిర్వహించడానికి 25 వేల రూపాయలు వసూలు చేస్తారు. దీనిలోనే ఆయా కార్యక్రమాలకు అవసరమైన సామాగ్రి కూడా ఉంటుంది. ఇక ఈయన ఎన్నో ఏళ్లుగా అంబానీ కుటుంబానికి ప్రత్యేక పూజారిగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అనంత్ అంబానీ వివాహం సందర్భంగా ఆయనకు లక్షల్లోనే దక్షిణ చెల్లించి ఉంటారనే టాక్ వినిపిస్తోంది.