నిజానికి గతంలో ముకేశ్ అంబానీ నివాసం ఉండే భవనం గురించి దాదాపు అన్ని మీడియా సంస్థలు విస్తృతంగా కవర్ చేశాయి. ఇక ఆ తర్వాత ఆయన డ్రైవర్ గురించి.. ఆయన కారు గురించి.. ముకేశ్ అంబానీ ధరించే దుస్తులు.. ముఖేష్ అంబానీ తినే ఆహారము.. ఇలా ముఖేష్ అంబానికి సంబంధించిన ప్రతి విషయం వార్తల్లో ముఖ్యాంశాలుగా నిలుస్తూ ఉండటం సహజమే.
అయితే అంబానీ భారతదేశంలోనే కాకుండా ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. అతని నికర విలువ సుమారు $116 బిలియన్లుగా అంచనా. బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం, అతను ప్రస్తుతం ప్రపంచంలోని 12వ అత్యంత సంపన్న వ్యక్తి. అతని తర్వాత, గౌతమ్ అదానీ $ 104 బిలియన్ల నికర విలువతో ఈ జాబితాలో ఉన్నారు. అయితే ముఖేష్ అంబానీ రోజుకు రూ.163 కోట్లు సంపాదిస్తున్నారని అంచనా వేయవచ్చు.
ఒక భారతీయుడు ప్రతి సంవత్సరం రూ. 4 లక్షలు సంపాదిస్తే, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ప్రస్తుత సంపదకు చేరుకోవడానికి 1.74 కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఇది దాదాపు అసాధ్యం. నివేదికల ప్రకారం.. ముఖేష్ అంబానీ ప్రతి సంవత్సరం దాదాపు 15 కోట్ల రూపాయల జీతం తీసుకునేవారు. కానీ, కరోనా తర్వాత జీతం తీసుకోవడం లేదు. ఇదిలావుండగా ఆయన రోజుకు రూ.163 కోట్లు సంపాదిస్తున్నారు.
ఈ డబ్బు అతనికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో వాటా నుండి వస్తుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్రోకెమికల్, ఆయిల్, టెలికాం, రిటైల్ వంటి అనేక రంగాలలో వ్యాపారాన్ని విస్తరించింది. ఇది కాకుండా, అతను ముంబైలోని తన ఇల్లు యాంటిలియాతో సహా రియల్ ఎస్టేట్‌లో చాలా ప్రదేశాలలో పెట్టుబడి పెట్టాడు. యాంటిలియా విలువ దాదాపు రూ.15 వేల కోట్లు ఉంటుందని అంచనా.