అవునా..! అంబానీ పెంపుడు కుక్క ప్రయాణించే కారు ఎన్ని కోట్లో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

దాదాపు నెలరోజుల పాటు సాగిన ఈ సంబరాలు అనంతరం అంబానీ తిరిగి వ్యాపారాలలో బిజీ అయ్యారు. వీరి పెళ్లికి చాలా మంది సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు ఎంట్రీ ఇవ్వడంతో వివాహం చాలా గ్రాండ్ గా జరిగింది. జియో వరల్డ్ సెంటర్లో అనంత్ అంబానీ, రాధిక వివాహం చాలా గ్రాండ్గా జరిగాయి. అయితే తాజాగా అంబానీ ఫ్యామిలీ నుంచి మారో న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. నూతన దంపతులైన అనంత్ అంబానీ రాధికా మర్చంట్ లతో పాటు వారి కుటుంబ సభ్యులు కలిసి భారీగా అలంకరించిన రోల్స్ రాయిస్ ఎస్680 మేబ్యాక్ కార్లలో వేదిక వ‌ద్ద‌కు వచ్చారు.

ఇలాంటి రిచ్ స్టేటస్ కేవలం అంబానీ కుటుంబ సభ్యుల కోసం మాత్ర‌మే కాదండోయ్.. వారు పెంచుకునే కుక్క కూడా ఉంది. అంబానీ ఇంట్లో పెరిగిన ఆ శునకం పేరు గోల్డెన్ రిట్రీవర్ హ్యాపీ. దీని కోసం కూడా ప్రత్యేకమైన విలాసవంతమైన కారును ఏర్పాటు చేశారు. అలా ఖరీదైన కారులో వేదిక వ‌ద్ద‌కు వ‌చ్చిన ఆ శునకం అందరిని ఆకర్షించింది. అయితే..వారి హ్యాపీ (కుక్క) హ్యాపీగా ప్రయాణించిన ఆ కారు ధర గురించి అందరూ తెగ సెర్చ్ చేస్తున్నారు.

అయితే ఆ కారు ధర రూ.4 కోట్ల ఉంటుందని సమాచారం. ఈ హ్యాపీ ప్రయాణించే కారు మెర్సిడెస్ బెంజ్ జీ400డీ ఖరీదు అక్షరాల రూ.4 కోట్లు అంట. వాహనాలు ఉన్నాయి. వీటిలోలో ఒకటైన జీ400డీ కారు ప్రత్యేకంగా హ్యాపీ(కుక్క) కోసం కొనుగోలు చేశారు. గతంలో ఈ హ్యాపీ కోసం టయోటా ఫార్చ్యూనర్, టయోటా వెల్‌ఫైర్‌ను వినియోగించారు.

కానీ ఇప్పుడు జీ400డీ కారులో ప్రయాణిస్తూ తన రాజ‌సాన్ని చూపిస్తోంది. ప్రస్తుతం ఈ హ్యాపీ ప్రయాణించిన కారు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని పేరే హ్యాపీ..దాన్ని పనే హ్యాపీ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *