సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో నిన్న చంచల్‌గూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అల్లు అర్జున్ బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా, నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే అల్లు అర్జున్ జైలు నుంచి ఇంటికి వెళ్లగా అతని అమ్మమ్మ ‘నాజర్ ఉతర్నా’ ఆచారం అంటే దిష్టి తియ్యగా అందుకు సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ దిష్టికి సంబందించిన క్లిప్‌లో అల్లు అర్జున్ తన అమ్మమ్మ పాదాలకు నమస్కారం చెయ్యగా దాని తర్వాత ఆమె దిష్టి తీస్తూ ఎమోషనల్ అయ్యారు… అయితే ఈ వీడియో చూపిస్తూ ఇంట్లో వాళ్ళు అందరూ కూడా దిష్టి గురించి చెప్తున్నారు. ఇంట్లో ఎంతోమంది దిష్టి తగిలింది అంటే పట్టించుకోరు కానీ దిష్టి తగిలితే మనిషి జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి.. దిష్టి అనేది నమ్మాలి అంటూ సోషల్ మీడియాలో పెద్దవాళ్ళు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. మీరు ఓసారి ఆ వీడియో చూసేయండి.
కాగా ఈ డిసెంబర్ నెల 4వ తేదీ పుష్ప 2: ది రూల్ ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ఒక మహిళ మరణించిన కేసులో అల్లు అర్జున్ డిసెంబర్ 13, 2024న అరెస్టయ్యాడు. సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్‌తో కలిసి ఈ కార్యక్రమానికి హాజరైన అల్లు అర్జున్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు గుమిగూడడంతో గందరగోళం ఏర్పడిన తర్వాత మహిళ మరణించింది. అనంతరం జరిగిన గొడవలో థియేటర్ ప్రధాన గేటు కూలిపోవడంతో తొక్కిసలాట జరిగింది. 35 ఏళ్ల మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె 9 ఏళ్ల కుమారుడికి తీవ్ర గాయాలయ్యాయి.
అల్లు అర్జున్‌ను అతని నివాసం నుండి పికప్ చేసి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. రూ.50,000 వ్యక్తిగత పూచీకత్తుపై 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే, పత్రాల పనిలో జాప్యం కారణంగా అతను ఒక రాత్రి జైలులో గడిపాడు.