ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారాల పట్టి అల్లు అర్హ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. తన మాటలతో, చేష్టలతో అప్పుడే కావాల్సినంత పాపులారిటీ తెచ్చుకుంది. అయితే ముఖ్యంగా అల్లు అర్హ, అయాన్ ల వీడియోలను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేస్తుంటుంది. వీటికి నెటిజన్ల నుంచి కూడా మంచి స్పందన వస్తుంటుంది. ముఖ్యంగా అల్లు అర్హ ఫొటోలు, వీడియోలకు సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
ఈ నేపథ్యంలో అల్లు అర్హకు సంబంధించి స్నేహా రెడ్డి షేర్ చేసిన కొన్ని ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. కాగా అల్లు స్నేహా రెడ్డి చిన్నప్పటి నుంచే తన పిల్లలకు అన్ని కళలను నేర్పిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా తన కూతురు అల్లు అర్హతో దగ్గరుండి మరీ కుమ్మరి పని చేయించింది. మట్టితో అందమైన దీపాలను తయారు చేయించింది. తల్లి సాయంతో అల్లు అర్హ కూడా ఎంతో చక్కగా మట్టి దీపాలను తయారుచేసింది.
ఇందుకు సంబంధించిన ఫొటోలను స్నేహా రెడ్డి తన సోషల్ మీడియాలో ఖాతాలో షేర్ చేసింది. దీంతో ఈ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి. వీటిని చూసిన సినీ అభిమానులు, నెటిజన్లు అల్లు అర్జున్ గారాల పట్టి ట్యాలెంట్ కు ఫిదా అవుతున్నారు. ట్యాలెంట్ లో బన్నీకి తగ్గ కూతురే అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ దర్శకుడు అట్లీ కుమార్ తో ఓ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు అల్లు అర్జున్.
ది గార్దియన్ ఆఫ్ ది గెలాక్సీ తరహాలో సూపర్ హీరో కాన్సెప్ట్ తో హాలీవుడ్ లెవల్లో అత్యాధునిక హంగులతో ఈ సినిమా తెరకెక్కుతోంది. బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొనె ఈ పాన్ వరల్డ్ ప్రాజెక్టులో హీరోయిన్ గా నటిస్తోంది. సన్ పిక్చర్స్ సంస్థ దాదాపు రూ.800 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
*AlluSnehaReddy Allu Arha Snapped At Allu Sirish Nayanika Engagement In Hyd* pic.twitter.com/dm5VDNB2b7
— AlluArjun Welfare Association BPL (@AIAFA_BPL) November 1, 2025
