తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయిన వ్యవహారంలో అల్లు అర్జున్ పైన కేసు నమోదైన విషయం తెలిసిందే. పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిచి, కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో చంచల్ గూడా జైలుకు పంపించారు. అయితే పిటిషన్పై విచారణ ముగిసింది.
ఈ కేసులో అల్లు అర్జున్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరిగింది. అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్పై చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. అనంతరం దీనిపై వాదనలు జరిగాయి. అల్లు అర్జున్ తరఫున సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు.
పోలీసుల తరుఫున వాదించిన పీపీ.. బన్నీ బెయిల్ పిటిషన్ రిజెక్ట్ చేయాలని కోరారు. ఇరు వైపులా వాదనలు విన్న నాంపల్లి కోర్టు.. బన్నీ రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై తీర్పును 2025, జనవరి 3వ తేదీకి వాయిదా వేసింది.