ఇవివి సత్యనారాయణ తండ్రి అల్లరి నరేష్ తాతగారు అయినటువంటి ఈదర వెంకట్రావు గారు మృతి చెందారు.ఆయన వయసు 90 సంవత్సరాలు.వృద్ధాప్య సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వస్తున్న ఆయన ఈరోజు తెల్లవారుజాము 3 గంటల ప్రాంతంలో కన్నుమూశారు.ఈరోజు నిడదవోలు మండలం, కోరుమామిడిలో సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరుగనున్నాయి.
అయితే వెంకట్ రావు భార్య వెంకటరత్నం 2019 మే 27న కన్నుమూశారు. ఈ దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు పెద్దకుమారుడు E.V.V. సత్యనారాయణ, రెండో కుమారుడు E.V.V. గిరి, మూడో కుమారుడు E.V.V. శ్రీనివాస్, కుమార్తె ముళ్లపూడి మంగాయమ్మ.

పెద్ద కుమారుడు ఈవీవీ సత్యనారాయణ తెలుగు సినిమా ప్రపంచంలో సక్సెస్ ఫుల్ డైరెక్టర్. ఎన్నో హిట్ చిత్రాలను రూపొందించారు. ఆయన కుమారులు ఆర్యన్ రాజేష్, అల్లరి నరేష్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్నారు.
వెంకట్ రావు పార్తివదేహానికి నిడదవోలు మండలం కోరుమామిడిలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు అంత్యక్రియలు జరుగనున్నాయి. ఆయన మృతిపట్ల సినీప్రముఖులు, అభిమానలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్యన్ రాజేశ్ సినిమాలకు దూరంగా ఉండగా.. అల్లరి నరేశ్ వరుస సినిమాలతో అలరిస్తున్నారు.
