బాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోకు ఆమె భార్య. ఆమెకు కోట్లల్లో ఆస్తి ఉంది. అలాగే ఇండియా వ్యాప్తంగా నటిగా ఆమెకు సూపర్ సాలిడ్ క్రేజ్ ఉంది. అలాగే ఆమెకు ఎన్నో అత్యంత అధునాతనమైన టెక్నాలజీతో కూడిన లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. వాటన్నింటినీ ఆమె పక్కన పెట్టి తాజాగా ముంబై వీధిలో ఓ చిన్న ఆటోలో తిరుగుతుంది. అయితే ఆమె మరెవరో కాదు అందాల భామ అలియా భట్.
ఈ అమ్మడికి వందల కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. డజన్ల కొద్దీ లగ్జరీ కార్లు ఉన్నాయి. అయినా కూడా ఆటోలో ప్రయాణించింది ఈ అందాల భామ. ఇటీవల ఓ సాయంత్రం ముంబైలో అలియా భట్ ఆటో తిరుగుతున్న వీడియో వైరల్‌గా మారింది. అది చూసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియో చూసిన వారు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
కొందరు దీనిని డ్రామా అని, మరికొందరు అలియా భట్‌కు అనుకూలంగా కామెంట్స్ చేస్తున్నారు. అలియా భట్ తన సింప్లిసిటీని చూపించేందుకే ఆటోలో ప్రయాణించిందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. కానీ అసలు విషయం వేరు. అలియా వెళ్లాల్సిన దారి చాలా ఇరుకుగా ఉంది. కాబట్టి, అంత చిన్న రోడ్డులో పెద్ద కార్లను తీసుకెళ్లడం సాధ్యం కాదు. అందుకే ఆమె ఆటోలో ప్రయాణించారని అభిమానులు అంటున్నారు.
అలియా భట్‌తో పాటు ఆమె బాడీ గార్డ్స్ కూడా ఉన్నారు. అలియాను చూసిన పాపరాజీ ఫోటోలు, వీడియోల కోసం ఆమెను అనుసరించారు.