విషాదంలో ఉన్న కమెడియన్ అలీని కొట్టిన నిర్మాత, అసలు నిజం ఏంటో తెలిస్తే..?

divyaamedia@gmail.com
2 Min Read

ఆలీ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు, టీవీ వ్యాఖ్యాత. 1100 కి పైగా సినిమాల్లో నటించాడు. ఆలీ బాల నటుడిగా తెలుగు చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు. సీతాకోకచిలుక చిత్రం ద్వారా ప్రసిద్ధి చెందాడు. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్ వారు ఆలీకి గౌరవ డాక్టరేట్ ను ప్రకటించారు. అయితే అలీ రాజమండ్రికి చెందిన వ్యక్తి. నిప్పులాంటి నిజం షూటింగ్ కోసం అలీ రాజమండ్రి నుంచి చెన్నైకి వెళ్ళాలి. కానీ అప్పట్లో ఆంధ్రాలో పెద్ద తుఫాను వచ్చింది. పైగా అదే సమయంలో అలీ మూడవ సోదరి మరణించారట.

అలీ మాట్లాడుతూ మా చెల్లి చనిపోయింది.. ఆ టైంలో తుఫాను కూడా ఎక్కువగా ఉండటంతో షూటింగ్ కి వెళ్ళలేకపోయాను. మరుసటి రోజు ఎలాగోలా చెన్నైకి వెళ్లి షూటింగ్ కి హాజరయ్యాను. ఆ చిత్ర నిర్మాత నన్ను పిలిచి షూటింగ్ కి ఎందుకు రాలేదని కొట్టారు. ఇంతమంది ఆర్టిస్టులు షూటింగ్ కి వస్తే నీకు రావడానికి ఏం.. అంటూ గట్టిగా అరుస్తూ నన్ను కొట్టారు. నేను బాధపడుతూ పక్కన కూర్చుండి పోయాను. రాఘవేంద్ర రావు గారు అప్పుడే కారు దిగి నన్ను చూశారు.

ఏరా ఎందుకలా ఉన్నావ్ ఏం జరిగింది అని అడిగారు. దీనితో నేను నిర్మాత కొట్టారు అని చెప్పాను. రాఘవేంద్ర రావు గారు నిర్మాతను పిలిచి వీడిని ఎందుకు కొట్టారు అని అడిగారు. షూటింగ్ కి రాలేదు కదా అని నిర్మాత సమాధానం ఇచ్చారు. షూటింగ్ కి రాకపోతే కొడతారా? వాడు చిన్న పిల్లాడు కారణం తెలుసుకోకుండా అలా కొట్టడం ఏంటి.. వాడి చెల్లి చనిపోయింది తెలుసా అందుకే షూటింగ్ కి రాలేదు.

నిజం తెలుసుకోకుండా ఇలా ప్రవర్తించవద్దు అని నిర్మాతకు వార్నింగ్ ఇచ్చి ఆరోజు షూటింగ్ ను రాఘవేంద్రరావు గారు క్యాన్సిల్ చేసేశారు అని అలీ తెలిపారు. రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఆలీని చూస్తే నాకు శ్రీదేవి గుర్తొస్తుంది. ఎందుకంటే అలీ కూడా ఆమెలాగే చైల్డ్ ఆర్టిస్ట్ గా నా కళ్ళముందే పెరిగాడు. అలీ కూడా శ్రీదేవి తరహాలో బాలీవుడ్ కి వెళ్లి రాణించాలని కోరుకుంటున్నట్లు రాఘవేంద్రరావు తెలిపారు.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *