అలేఖ్య..నిత్యం తన భర్త అందించిన మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటోంది. అలాగే సోషల్ మీడియాలో తారక రత్న, పిల్లల ఫొటోలను షేర్ చేస్తూ ఎమోషనల్ అవుతుంటుంది. ఇదిలా ఉంటే బుధవారం అలేఖ్యా రెడ్డి పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.
అయితే నటుడు తారకరత్న మరణం తర్వాత ఆయన భార్య అలేఖ్య రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుంది. వైసీపీ నేత విజయసాయి రెడ్డి ఫ్యామిలీ అలేఖ్యకు బంధువులు అవ్వడంతో ఆ ఫ్యామిలీతో ఎక్కువ ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తుంది. తాజాగా అలేఖ్య తన పుట్టిన రోజు సెలెబ్రేషన్స్ వీడియోని షేర్ చేసి ఎమోషనల్ పోస్ట్ చేసింది
. వైఎస్ షర్మిల దగ్గరుండి అలేఖ్య బర్త్ డేని సెలబ్రేట్ చేసింది. షర్మిల అలేఖ్యకు అక్క వరుస అవుతుంది. షర్మిల దగ్గరుండి కేక్ కట్ చేయించి అలేఖ్య బర్త్ డేని సెలబ్రేట్ చేసింది. దీంతో అలేఖ్య ఎమోషనల్ అవ్వగా షర్మిల దగ్గరకు తీసుకొని హత్తుకుంది. ఈ వీడియోని షేర్ చేసి అలేఖ్య.. గత కొన్నేళ్లుగా నా పక్కన ఉంటావు అని చేసిన ప్రామిస్ ని నువ్వు నిలబెట్టుకుంటున్నావు అక్క.
నా కోసం టైం ఇచ్చి నా బర్త్ డే ని సెలెబ్రేట్ చేసినందుకు ధన్యవాదాలు. నాకు కన్నీళ్లు వస్తున్నాయి. నువ్వు చేసే చిన్న పని కూడా నాకు బ్లెస్సింగ్ లా అనిపిస్తుంది. నువ్వు నాకెంత స్పెషల్ అనేది నేను చెప్పలేను. నీ స్థానాన్ని ఎవరూ రీప్లేస్ చేయలేరు అక్క. లవ్ యు షర్మిల అక్క అంటూ ఎమోషనల్ పోస్ట్ చేసింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.