అక్కినేని వారే దూరం పెట్టిన ఆమెతో చీర పెట్టించుకున్న శోభితా.. ! షాక్ లో నాగార్జున.

divyaamedia@gmail.com
2 Min Read

సమంతతో విడాకుల తర్వాత కెరీర్‌లో బిజీ అయిపోయారు నాగ చైతన్య. వరస సినిమాలు చేస్తూ అస్సలు గ్యాప్ ఇవ్వలేదు. ఈ మధ్యలోనే శోభిత ధూళిపాళతో చైతూ ప్రేమలో ఉన్నారనే వార్తలు వినిపించాయి. వాటిని కన్ఫర్మ్ చేస్తూ ఆగస్ట్ 8న ఈ జంట నిశ్చితార్థం చేసుకున్నారు. తాజాగా పెళ్లి పనులు కూడా మొదలైపోయాయి. అయితే అయితే పెళ్లి డేట్‌పై ఇంకా అఫీషియల్ అప్‌డేట్ లేనప్పటికీ అప్పుడే అక్కినేని కొత్త కోడలు ఇంట్లో పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. తాజాగా శోభిత దూళిపాళ ఇన్‌స్టాగ్రామ్‌లో ”గోధుమ రాయి పసుపు దంచడం” అంటూ ఫోటోలు షేర్ చేసింది. అయితే ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు తెలియజేస్తున్నారు.. కొందరు ఆమెను బాగుంది అంటే మరికొందరు ఆమె చీర బాగుందని కామెంట్స్ చేస్తున్నారు.

నిజానికి శోభితా ధరించిన చీర చాల అందంగా ఉంది.. చాలా సింపుల్ గా ఉంది… కాంచీపురం చీర, గోల్డ్ కంటే నెక్లెస్, చంద్రహారం, మట్టి గాజులు ధరించి తెలుగువారిని ఆకట్టుకుంది. అయితే ఆమె ధరించిన చీర ఎక్కడ కొన్నారు అని అడగ్గా. ఆమె తన అత్త లక్ష్మిది అని కామెంట్ చేశారు.. దాంతో నెటిజన్స్ షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. అక్కినేని కుటుంబం దూరం పెట్టిన లక్ష్మితో చీర సంపాదించి మరీ అది పసుపు ఫంక్షన్ లో వేసుకున్నారా అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. అయితే మరికొందరు నెటిజన్స్ మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఒక్క శోభితానే కాదు గతంలో సమంతకు లక్ష్మి పెళ్లి టైమ్ సపోర్ట్ ఉందంటూ కామెంట్స్ చేశారు.

ఏది ఏమైనప్పటికి శోభిత చైతూ పెళ్లిపై ఎంతోమంది వ్యతిరేకులాగానే ఉన్నారు. ఇకపోతే చడి చప్పుడు లేకుండా నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ ఆగస్ట్ 8న జరిగిపోయింది. మాములుగా ఒక సెలబ్రెటీకి సంబంధించిన చిన్న ఈవెంట్ అయినా సరే వారం, పది రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటుంది. అలాంటిది నాగచైతన్య లాంటి స్టార్ నటుడి ఎంగేజ్‌మెంట్.. నాగార్జునకు ఫోటోలు పెట్టేసరికి కూడా క్లారిటీ రాలేదంటే, ఎంత సీక్రెట్‌గా నిశ్చితార్థం జరిపారో అర్థం చేసుకోవచ్చు. నిజానికి గతకొంత కాలంగా నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల డేటింగ్‌లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం కూడా వాళ్లలో ఉందని కూడా పలు రూమర్స్ సోషల్ మీడియాను ఊపేశాయి.

వీటిని నిజం చేస్తూ వీరిద్దరు కూడా కలిసి పార్టీలకు, రెస్టారెంట్లకు వెళ్లిన ఫోటోలు కూడా వైరల్ అవుతూనే ఉంటాయి. మరీ ముఖ్యంగా యూరప్‌లోని ఓ బార్‌లో వైన్ టెస్టింగ్ సెషన్‌లో చైతూ, శోభిత పాల్గొన్నట్లుగా ఓ ఫోటో సోషల్ మీడియాను మామలుగా ఊపలేదు. అప్పుడు వీరిద్దరి లవ్ దాదాపు కన్ఫర్మ్ అయినట్లు అనిపించింది. కానీ ఎక్కడో వీళ్ళు మంచి ఫ్రెండ్స్ అని కూడా చాలా మంది అనుకున్నారు. కట్ చేస్తే.. ఎంగేజ్‌మెంట్ చేసుకుని ఈ జంట అందరికీ షాక్ ఇచ్చింది. అది కూడా నాగచైతన్య, సమంతలు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకున్న రోజునే.. నాగచైతన్య, శోభితను ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం అనేది గమనార్హం.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *