అక్కినేని వారింట పెళ్లి సంబరాలు, కాబోయే కోడలికి ఎవ్వరు ఊహించని గిఫ్ట్ ఇచ్చిన నాగ చైతన్య తల్లి.

divyaamedia@gmail.com
1 Min Read

అక్కినేని వారింట పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. రెండు నెలల కిందే నటి శోభితా ధూళిపాళతో నిశ్చితార్థం చేసుకున్నారు నాగ చైతన్య. అయితే ఆ తర్వాత మళ్ళీ ఇద్దరూ కలిసి కనిపించలేదు. ఇన్నాళ్ళ తర్వాత ఈ జోడీ ట్రెండింగ్ అవుతున్నారు. అయితే పెళ్లి డేట్‌ ఇంకా ప్రకటించనే లేదు.. అప్పుడే అక్కినేని కొత్త కోడలు ఇంట్లో పెళ్లి సంబురాలు కూడా మొదలయిపోయాయి.

రీసెంట్‌గా శోభిత దూళిపాళ ఇన్‌స్టాగ్రామ్‌లో ‘గోధుమ రాయి పసుపు దంచడం’ మొదలైంది అంటూ ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో మాములుగా వైరల్ కాలేవు. అసలు ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ చూసిన అవే ఫోటోలు. ఇక ప్రస్తుతం శోభిత తన ఫ్యామిలీతో కలిసి పెళ్లి పనుల్లో మునిగిపోయింది. ఇదంతా ఇలా ఉంటే.. కొత్త కొడలి కోసం నాగ చైతన్య వాళ్ల అమ్మ ఓ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చినట్లు సమాచారం.

ఆ గిఫ్ట్ ఏంటా అనుకుంటున్నారా..? ఆ గిఫ్ట్ మరేంటో కాదు.. చీర. నిన్న పోస్ట్ చేసిన ఫోటోల్లో శోభిత కట్టుకున్న చీరను.. నాగ చైతన్య తల్లి దగ్గుబాటి లక్ష్మీ గిఫ్ట్‌గా ఇచ్చిందట. ఇక నాగచైతన్య తల్లి నాగార్జునకు మొదటి భార్య. ప్రస్తుతం ఆమె యూఎస్‌లో సెటిల్ అయింది. కాగా.. చడి చప్పుడు లేకుండా నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్ గతనెల 8న జరిగిపోయింది.

మాములుగా ఒక సెలబ్రెటీకి సంబంధించిన చిన్న ఈవెంట్ అయినా సరే వారం, పది రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ ఉంటుంది. అలాంటిది నాగచైతన్య లాంటి స్టార్ నటుడి ఎంగేజ్‌మెంట్.. నాగార్జునకు ఫోటోలు పెట్టేసరికి కూడా క్లారిటీ రాలేదంటే, ఎంత సీక్రెట్‌గా నిశ్చితార్థం జరిపారో అర్థం చేసుకోవచ్చు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *