వేల కోట్ల ఆస్తులున్నా అక్కినేని అఖిల్ పెళ్లికి ఎంత ఖర్చు చేసారో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

ఆరడుగుల అందగాడు అఖిల్ పెళ్లిని అనంత అంబానీ రేంజ్‌లో ప్రీ-వెడ్డింగ్ పార్టీలతో ధూమ్ ధామ్ చేసి, రూ.100 కోట్లు ఖర్చు పెట్టి చేస్తాడని అక్కినేని ఫ్యాన్స్ ఆశించారు. అయితే నాగ్ మాత్రం పెద్దగా హడావుడి లేకుండా సైలెంట్‌గా చిన్న కొడుకు పెళ్లి తంతు ముగించాడు. అయితే జూబ్లీహిల్స్‌లోని నాగార్జున నివాసంలో మూడు గంటల సమయంలో, వేద మంత్రాల సాక్షిగా ప్రేయసి మెడ తాళి కట్టాడు అఖిల్. ఈ వివాహానికి కొందరు టాలీవుడ్ ప్రముఖులతో పాటు కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం పూర్తిగా ప్రైవేట్‌గా నిర్వహించబడింది.

అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వివాహానికి కొద్దిమంది మాత్రమే హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత సురేష్ బాబు, హీరో రామ్‌ చరణ్ – ఉపాసన, దగ్గుబాటి వెంకటేష్, రానా సహా అక్కినేని ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకలో పాల్గొనగా, నాగచైతన్య, శోభితా దూళిపాళ్ల, సుశాంత్, సుమంత్, నాగసుశీల, సుప్రియా తదితరులు కనిపించారు. తమ్ముడి పెళ్లిలో అన్న నాగచైతన్య సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బరాత్ కార్యక్రమంలో చైతూ చేసిన డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇదిలాఉంటే జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోస్‌లో అఖిల్- జైనాబ్ రిసెప్షన్ పార్టీ జరిగింది. ఈ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, మహేష్ బాబు సహా పలువురు సినీ రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అయితే అసలు ఈ పెళ్లి కోసం అక్కినేని ఫ్యామిలీ ఎంత ఖర్చు చేసింది? ఎంత అట్టహాసంగా పెళ్లి, రిసెప్షన్ పూర్తి చేశారనే దానిపై టాలీవుడ్ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు అఖిల్ పెళ్లి మొత్తం ఖర్చు రూ. 2 కోట్లు అని తెలుస్తోంది.

ఇందులో పెళ్లి బట్టలు, బంగారు నగల కోసమే ఎక్కువ శాతం ఖర్చు కాగా రిసప్షెన్‌కి వచ్చిన అతిథుల విందు కోసం రూ.50 లక్షల దాకా ఖర్చు చేశారని టాక్. ఈ విషయాలు తెలిసి అక్కినేని ఫ్యామిలీ రేంజ్‌కి తగ్గట్టు ఈ పెళ్లి జరగలేదని జనం చెప్పుకుంటున్నారు. పెద్దగా హడావుడి లేకుండా సైలెంట్‌గా నాగార్జున తన చిన్న కొడుకు పెళ్లి తంతు ముగించాడని చర్చించుకుంటున్నారు. మరోవైపు అఖిల్ పెళ్లి, రిసెప్షన్ ఫొటోస్ మాత్రం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *