మిన్నియాపాలిస్ నుండి వచ్చిన డెల్టా విమానంలో ఒక సంఘటన జరిగిందని టొరంటోలోని పియర్సన్ విమానాశ్రయం తెలిపింది. ఆ విమానంలో 76 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగిందని డెల్టా ఎయిర్ లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
అయితే కెనడాలోని టొరంటో ఎయిర్‌పోర్టులో సోమవారం ఓ విమానం అదుపుతప్పి అమాంతం బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ సమయంలో స్కిడ్ అయి పల్టీలు కొట్టింది. అక్కడ తీవ్రంగా మంచు కురుస్తుండటంతో విమానం రన్‌వేపై అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 19 మందికి గాయాలు అయ్యాయి.
వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో విమానంలో 76 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ విమానం మిన్నెపోలిస్ నుంచి టొరంటోకు వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం నేపథ్యంలో ఎయిర్‌పోర్టును మూసివేశారు.