‘నమస్తే అన్నా..’ అంటూ అగ్గిపెట్టె మచ్చా ఆప్యాయంగా సంభాషణ మొదలుపెడతాడు. కానీ, అవతలి వాళ్లు రెచ్చగొట్టడం, అటుపైన తనదైన స్టైల్లో వాళ్లపై బూతు పురాణం అందుకోవడం..! ఇలా, తన తిట్లదండకం ద్వారానే ‘అగ్గిపెట్టె మచ్చా’గా ఓవర్ నైట్‌లో ఫేమస్ అయ్యాడు. చిత్తూరుకు చెందిన కిరణ్ కుమార్ అలియాస్ అగ్గిపెట్టె మచ్చా.. ఇప్పుడు అరుదైన ఘనతను దక్కించుకున్నాడు. అయితే అగ్గిపెట్టె మచ్చపై తాజాగా దాడి జరిగింది.
తిరుపతిలోని అమెరికన్ బార్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో అగ్గిపెట్టె మచ్చపై స్థానికంగా ఉన్న యువకులు దాడి చేశారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అగ్గిపెట్టె మచ్చ ఏది చేసినా సరే సెన్సేషన్ అన్నట్టే ఉంటుంది. అతను కొంత కాలంగా యూట్యూబ్ మీడియాకు దూరంగానే ఉంటున్నాడు. ఈ క్రమంలోనే అతను తిరుపతిలోని అమెరికన్ బార్ కు వెళ్లాడు.
అక్కడ బాగా మద్యం తాగిన తర్వాత అతను బూతులతో రెచ్చిపోయడు. ఎవరిని పడితే వారిని తిట్టడంతో అక్కడున్న యువకులు అతన్ని ప్రశ్నించారు. తనను ప్రశ్నించిన యువకులపై కూడా బూతులతో రెచ్చిపోయాడు అగ్గిపెట్టె మచ్చ. దాంతో ఆ యువకులు అగ్గిపెట్టె మచ్చపై దాడి చేశారు. ఈ ఘర్షణలో అగ్గిపెట్టె మచ్చపై ఉన్న బట్టలు కూడా చినిగిపోయాయి. రోడ్డుపైనే అతన్ని చితక్కొట్టారు. అయితే కొడుతున్న సమయంలో కూడా అగ్గిపెట్టె నవ్వుతూ ఉండటం వీడియోలో కనిపిస్తోంది.
ఈ దాడి చేసింది ఎవరో ఇంకా తెలియాల్సి ఉంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ దాడిపై సోషల్ మీడియాలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. కొందరేమో అగ్గిపెట్టె మచ్చపై దాడిని ఖండిస్తుంటే.. ఇంకొందరేమో బాగా జరిగింది వాడికి అలాగే జరగాలి అంటూ కామెంట్లు పెడుతున్నారు.