అవునా..! అనంత్-రాధిక మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉందొ తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

బాలీవుడ్ నుండి హాలీవుడ్, రాజకీయాల నుండి క్రీడల వరకు పలువురు ప్రముఖులు కూడా ఈ జంట వివాహానికి హాజరయ్యారు. అనంత్-రాధిక వివాహానికి వచ్చిన అతిథుల కోసం అంబానీ కుటుంబం ప్రత్యేక ఆహార, పానీయాల ఏర్పాట్లు చేశారు. ఈ వివాహ వేడుకలో రకరకాల వంటలు చేశారు. ఈ ప్రస్తుతం ఈ వంటలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే అనంత్- రాధికలు చిన్నప్పటి నుంచి మంచి స్నేహితులు.

తర్వాత ఆ స్నేహం ప్రేమగా మారి.. చివరకు పెళ్లి బంధానికి దారితీసింది. వీరిద్దరి లవ్ మ్యారేజ్ అని అందరికీ తెలుసు. కానీ.. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉందో ఎప్పుడైనా ఆలోచించారా..? మీరు నమ్మని విషయం ఏమిటంటే.. రాధిక కంటే… అనంత్ అంబానీ చిన్నవాడు. ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలి అంటే.. అమ్మాయి.. అబ్బాయి కంటే వయసులో కనీసం పదేళ్లు చిన్న అయ్యి ఉండేవారు. ఇప్పుడు కాలం మారింది. ఏజ్ గ్యాప్ పెద్దగా ఉండటం లేదు.

మహా అంటే.. ఒకే వయసు వారు పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ.. ఇక్కడ వీరి పెళ్లిలో మాత్రం.. రాధిక మర్చంట్.. తన భర్త అనంత్ కంటే పెద్ద కావడం విశేషం. ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం, అనంత్ అంబానీ 10 ఏప్రిల్ 1995న జన్మించారు. పుట్టిన తేదీ ప్రకారం అనంత్ అంబానీ వయస్సు 29 సంవత్సరాల 3 నెలలు. రాధిక మర్చంట్ 18 డిసెంబర్ 1994న జన్మించారు. పుట్టిన తేదీ ప్రకారం, 29 సంవత్సరాల 7 నెలలు.

రాధిక మర్చంట్ అనంత్ అంబానీ కంటే దాదాపు 4 నెలలు పెద్దది. అనంత్, రాధిక కలిసి చదువుకున్నారు. రాధిక మర్చంట్ తన ప్రారంభ విద్యను ఎకోల్ మొండియల్ వరల్డ్ స్కూల్ , జాన్ కానన్ స్కూల్‌లో పొందారు. ఆ తరువాత న్యూయార్క్ విశ్వవిద్యాలయం నుండి రాజకీయాలు , ఆర్థిక శాస్త్రంలో మాస్టర్స్ డిగ్రీని పొందారు. రాధిక మర్చంట్ గొప్ప భరతనాట్య కళాకారిణి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *