Actress Renu Desai | టాలీవుడ్ నటి రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న విషయం తెలిసిందే. ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లతో తన అభిరుచులను పంచుకుంటుంది. ఇక పవన్‌తో విడాకుల తర్వాత రేణు దేశాయ్ తర్వాత తిరిగి సినిమాల్లో యాక్టివ్ కావాలని భావిస్తున్నారు.దీనిలో భాగంగానే గతేడాది రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు సినిమాలో కీలక పాత్రలో నటించారు.
అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు మరో సినిమాలో రేణు దేశాయ్ నటించలేదు. అయితే తాజాగా ఆమె తన అభిమానులకు గుడ్ న్యూస్ అందించారు. ఆమె మరో సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేశారు.
”షూటింగ్లో పాల్గొనడం కోసం. ఏడాది తర్వాత మళ్లీ మేకప్ వేసుకుంటున్నాను” అంటూ ఓ పోస్ట్‌ను షేర్ చేశారామె. అయితే తాను ఎవరి సినిమాలో నటిస్తుందో మాత్రం వెల్లడించలేదు.ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసిన రేణు దేశాయ్, ‘మోడ్రన్ మెడిసిన్స్, నా శరీరాన్ని భౌతికంగా బతికించగలుగుతున్నాయి.. బతకడానికి కావాల్సిన ధైర్యాన్ని సంపాదించడం చాలా కష్టంగా ఉంది..’అంటూ సెలైన్ ఎక్కుతున్న వీడియోను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది…
Also Read : కార్తీక మాసంలో మాంసం ఎందుకు తినకూడదో తెలుసా ..
గత ఏడాది తన ఆరోగ్యం గురించి చెబుతూ ఓ సుదీర్ఘ పోస్ట్ చేసింది రేణు దేశాయ్. ‘నేను కొన్నేళ్లుగా హార్ట్, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాను. కొన్నిసార్లు నా శరీరాన్ని అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడాల్సి వస్తోంది. నేను ఈ విషయాన్ని షేర్ చేయడానికి ప్రధాన కారణం.. నాలా, ఆరోగ్య సమస్యలతో పోరాడుతున్న చాలా మందికి మనోధైర్యం నింపాలని! ఆత్మవిశ్వాసం ఉంటే ఎలాంటి సమస్యనైనా ఎదురించవచ్చు..ఎలాంటి పరిస్థితుల్లోనూ జీవితంపై ఆశను కోల్పోకండి. ఈ ప్రపంచం మనకోసం కొన్ని స్వీట్ ప్లాన్స్ దాచి ఉంచుతుంది. కాబట్టి నవ్వండి, దూకండి, ఎగరండి.. నేను సాధారణ జీవితంలోకి తిరిగి రావాలని, వస్తానని కోరుకుంటూ..’ అంటూ రాసుకొచ్చింది రేణు దేశాయ్..
Also Read : డిసెంబర్లో హీరోయిన్ కీర్తి సురేశ్ పెళ్లి… వరుడు ఎవరంటే ..?