Actress Hema: నేను డ్రగ్స్ తీసుకోలేదు. పరువు భూస్థాపితం చేశారు..! 3 నెలల తర్వాత టెస్టులు చేయించి..!
Actress Hema: హేమ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో షేర్ చేసింది. అందులో ఆమె తాను డ్రగ్స్ తీసుకోలేదు అని మరోసారి చెప్పే ప్రయత్నం చేసింది. అందుకు సంబంధించి తాను టెస్ట్ లు కూడా చేయించుకున్నానని ఆమె వెల్లడించింది. ”కొన్ని నెలలుగా నా మీద మీడియాలో చాలా పుకార్లు పుట్టాయి, అది మీ అందరికీ తెలుసు. మీడియా వాళ్ళు 35 సంవత్సరాలుగా నేను సంపాదించుకున్న పరువు ఎలా భూస్థాపితం చేశారో మీ అందరికీ తెలిసిందే. అయితే మే నెలలో బెంగళూరు రేవ్ పార్టీ కేసు వెలుగులోకి రాగానే… హేమ పేరు బాగా వినిపించింది.
Also Read: డైరెక్టర్ చేసిన పనికి సెట్ లో బోరున ఏడ్చేసిన ఇంద్రజ, అసలు ఏం జరిగిందంటే..?
డ్రగ్స్ విషయంలో హేమపై కేసు నమోదైంది నిజం… మా అసోసియేషన్ ఆమె సభ్యత్వాన్ని కూడా తాత్కాలికంగా తొలగించిన మాటా నిజం. అయితే బెంగళూరు రేవ్ పార్టీకి.. తనకు ఎలాంటి సంబంధం లేదంటూ ఆస్కార్ రేంజ్‌లో యాక్టింగ్ చేసి… తిమ్మిని బమ్మిని చేయడానికి ప్రయత్నించింది. సీన్ కట్ చేస్తే..ఏమైందో తెలుసాగా… బెంగుళూరు పోలీసులు ఆమె ఫోటో కూడా విడుదల చేసి, పక్కా ఆధారాలతో సీరియస్ అయ్యేసరికి జైలుకు వెళ్లింది. తరువాత బెయిల్ తెచ్చుకుంది. అప్పుడు డ్రగ్స్ టెస్ట్‌లో హేమకి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు.
అయితే ఇప్పుడు తనకు నెగిటివ్ వచ్చిందని హేమ వీడియో పోస్ట్ చేసింది. మరి అప్పుడు పోలీస్ టెస్ట్‌లో పాజిటివ్ ఎందుకొచ్చింది? పోలీస్ టెస్ట్‌లు ఫాల్సా? అన్నది హేమే చెప్పాలి. అయినా.. డ్రగ్స్ తీసుకోకుంటే.. పోలీసుల చెబుతున్నది తప్పు అని నిరూపించాలనుకుంటే.. జైలు నుంచి బయటకు రాగానే టెస్టులు చేయించుకుని.. రిపోర్టులు ఇలా బహిర్గతం చేసి ఉండాల్సింది. డ్రగ్స్ తీసుకుంటే.. గంటల వ్యవధిలో యూరిన్, బ్లడ్ టెస్టుల ద్వారా నిర్ధారించవచ్చు. గోళ్లు, వెంట్రుకలను టెస్టు చేయడం ద్వారా రెండు, మూడు నెలల వరకు నిర్ధారించవచ్చు.
Also Read: జాన్వీ కపూర్ తో రాఖీ కట్టించుకున్న అభిమాని. తర్వాత ఏం చేసాడో మీరే చుడండి.
కానీ హేమ.. మూడు నెలలు గడిచిన తర్వాత ఇప్పుడు వచ్చి తాను సుద్దపూసను అని చెబుతోంది. హేమ షేర్ చేసిన తాజా వీడియో బట్టి చూస్తే.. పోలీసులకు ఛాలెంజ్ చేసినట్లే అనిపిస్తుందన్న వర్షన్ వినిపిస్తోంది. ఎందుకంటే ఈమె డ్రగ్స్ తీసుకుందని పోలీసులు తేలిస్తే.. ఇప్పుడేమో హేమ తాను ఎలాంటి టెస్ట్‌లకైనా రెడీ అంటూ వీడియో పెట్టింది. హేమ ఈ విషయాన్ని ఇక్కడితే వదిలేస్తేనే ఆమెకు మంచిది. పోలీసులే తనను తప్పుగా చూపించారు అనే ప్రయత్నం చేస్తే.. మళ్లీ వాళ్లు కేసును తిరగతోడే ప్రమాదం ఉంది.