హీరోయిన్ లాగా మెరిసిపోతున్న నటి ఇంద్రజ కూతుర్ని చూసారా..?

divyaamedia@gmail.com
2 Min Read

ఇప్పుడు ఇండస్ట్రీలో మరో సెలబ్రిటీ కూతురు డెబ్యూకి రెడీ అవుతోందని టాక్ బలంగా వినిపిస్తుంది. ఆ సెలబ్రిటీ ఎవరో కాదు.. సీనియర్ నటి ఇంద్రజ. ఈమె గురించి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. 90లలో హీరోయిన్ గా అందరు స్టార్ హీరోల సరసన సినిమాలు చేసింది. అప్పట్లోనే ఇండస్ట్రీని తన గ్లామర్, యాక్షన్ తో ఓ ఊపు ఊపేసింది. అయితే హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. పిల్లలు, కుటుంబ బాధ్యతలతో బిజీ అయిపోయింది.

అయితే చాలా మంది హీరోయిన్ల లాగానే సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. స్టార్ హీరోలకు తల్లిగా, అత్తగా నటిస్తూ మెప్పిస్తోంది. అలాగే టీవీ షోలకు జడ్జిగా వ్యవహారిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కూడా ఎంటర్ టైన్ చేస్తోందీ అందాల తార. ఇటీవల ఇంద్రజ ప్రధాన పాత్రలో నటించిన మారుతీ నగర్ సుబ్రమణ్యం సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే టీవీ షోలతో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉంటోందీ అందాల తార. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఇంద్రజ ఫ్యామిలీ గురించి చాలా మందికి తెలియదు.

సోషల్ మీడియాలోనూ ఈ నటి ఫ్యామిలీ మెంబర్స్ పెద్దగా కనిపించరు. కాగా సాంప్రదాయ తుళు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఇంద్రజ తమిళ టీవీ నటుడు అబ్సర్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. అయితే వీరివి వేర్వేరు మతాలు కావడంతో తల్లిదండ్రులు ఇంద్రజ పెళ్లికి అంగీకరించలేదట. దీంతో ఇంద్రజ, అబ్సర్ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. ఈ విషయాన్ని ఇంద్రజనే ఒక ఇంటర్వ్యూలో బయట పెట్టారు. ఇంద్రజ- అబ్బర్ దంపతులకు సారా అనే ముద్దుల కూతురు ఉంది. త్వరలోనే ఆమె కూడా సినిమ ఇండస్ట్రీలోకి వచ్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

ప్రస్తుతం సారా సంగీతం నేర్చుకుంటోందట. కొన్ని రోజుల క్రితం తన కూతురు గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ‘నా కూతురుకు నటన కన్నా మ్యూజిక్ మీద ఎక్కువ ఆసక్తి ఉంది. భవిష్యత్ లో తను మంచి మ్యూజిక్ డైరెక్టర్ అవుతుంది’ అని చెప్పుకొచ్చింది. కాగా సారా కూడా తల్లి ఇంద్రజ లాగే ఎంతో అందంగా ఉంది. దీంతో అభిమానులు, నెటిజన్లు సారాను హీరోయిన్ గా ట్రై చేయమంటున్నారు. మరి ఫ్యూచర్ లో సారా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *