హీరో నాగార్జున అన్న కొడుకుని హీరో కాకుండా చేసింది ఎవరో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

చైల్డ్ ఆర్టిస్టు నుంచి హీరోగా అక్కినేని నాగార్జున రెండేళ్ల వసులోనే ‘వెలుగు నీడలు’ అనే సినిమాలో కనిపించి.. ఆ తర్వాత ‘సుడిగుండాలు’ అనే చిత్రంలో నటించారు. ఈ క్రమంలోనే 1986లో ‘విక్రమ్’ అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని నాగార్జున.. తక్కువ సమయంలోనే స్టార్‌గా మారారు. దీంతో వరుస పెట్టి సినిమాల మీద సినిమాలు చేస్తూ వస్తున్నారు. అయితే సుదీర్ఘకాలం తెలుగు సినిమాను శాసించిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు.

ఎన్టీఆర్-ఏఎన్నార్ టాలీవుడ్ కి రెండు కళ్ళు అంటారు. ఇక ఏఎన్నార్ కుమారులు వెంకట్, నాగార్జున పరిశ్రమలో రాణించారు. పెద్దబ్బాయి వెంకట్ ని నిర్మాతను చేశాడు. అన్నపూర్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ లో వెంకట్ అనేక చిత్రాలు నిర్మించాడు. నాగార్జున హీరోగా పరిచయం అయ్యాడు. కెరీర్ బిగినింగ్ లో ఒడిదుడుకులు ఎదుర్కొన్న నాగార్జున నిలదొక్కుకున్నాడు. మజ్ను, గీతాంజలి, జానకి రాముడు, శివ నాగార్జునకు స్టార్డమ్ తెచ్చిపెట్టాయి.

విభిన్నమైన సబ్జక్ట్స్ తో నాగార్జున అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు. ఏఎన్నార్ మూడోతరం వారసులుగా సుమంత్, సుశాంత్ పరిశ్రమలో అడుగుపెట్టారు. వీరు నాగార్జున కూతుళ్ల కుమారులు. వీరిద్దరూ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఇక నాగార్జున ఇద్దరు కుమారులు నాగ చైతన్య, అఖిల్ కూడా హీరోలు అయ్యారు. నాగ చైతన్య టైర్ టు హీరోల జాబితాలో చోటు సంపాదించారు. తనకంటూ మార్కెట్, ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అఖిల్ కి ఇంకా బ్రేక్ రాలేదు. ఆయన స్ట్రగుల్ అవుతున్నారు. అక్కినేని వెంకట్ సైతం పరిశ్రమలోనే ఉన్నారు.

ఏఎన్నార్ తో పాటు నాగార్జునతో ఆయన చిత్రాలు నిర్మించారు. దశాబ్దాల అనుభవం వెంకట్ కి ఉంది. ఆయన కుమారుడి పేరు అక్కినేని ఆదిత్య. మరి అక్కినేని వెంకట్ పరిశ్రమకు ఎందుకు దూరమయ్యాడు? ఆయన హీరో ఎందుకు కాలేదనే వాదన ఉంది. ఆదిత్య చూడటానికి బాగుంటాడు. పక్కా హీరో మెటీరియల్. ఆదిత్య గురించి జనాలకు తెలిసింది తక్కువే. దానికి కారణం.. ఆదిత్య సినిమా కార్యక్రమాలు, వేడుకలకు దూరంగా ఉంటారు. వెంకట్ కొడుకును హీరో చేయాలి అనుకోలేదా? లేదంటే నాగార్జున ప్రోత్సహించ లేదా? అనే సందేహాలు ఉన్నాయి.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *