ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న ఐశ్వర్యరాయ్..? డాక్టర్స్ ఏం చెప్పారంటే..?

divyaamedia@gmail.com
2 Min Read

కొద్దిరోజుల కింద ప్యారిస్‌ ఫ్యాషన్‌ వీక్‌లో ర్యాంప్‌పై నడించింది. ఆ తర్వాత ఆమెపై కొంత ట్రోల్స్‌ వచ్చాయి. అయితే, ఆమె తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారంటూ రెడ్డిట్‌ యాప్‌లో పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం ఆ పోస్ట్‌ని డిలీట్‌ చేసినా.. వైరల్‌గా మారింది. అయితే బాలీవుడ్ అందాల భామ ఐశ్వర్యారాయ్ తన భర్త అభిషేక్ బచ్చన్ విడాకులు విడిపోతున్నారని ఈ మధ్య వార్తలు బాగా వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌లో చూసిన ఇప్పుడు ఇదే టాక్. ఈ మధ్య ఐశ్వర్య రాయ్ కూతురితో మాత్రమే కనిపిస్తుంది. బచ్చన్ ఫ్యామిలితో ఆమె కనిపించకపోవడంతో.. ఐష్ అభిషేక్‌తో విడిపోతుందని టాక్ వైరల్ అయ్యింది.

బచ్చన్ కుటుంబం ఐశ్వర్యను పూర్తిగా పట్టించుకోలేదని కూడా వినిపిస్తోంది. అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ వివాహం సమయంలోను ఐష్ తన కూతురు ఆరాధ్యతో కలిసి సపరేట్‌గా వచ్చారు. ఇది గమనించిన జనాలు బచ్చన్ కుటుంబంలో విభేదాలు వచ్చినట్లు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇక ఐష్ అభిషేక్ విడిపోతున్నట్టు వస్తున్న వార్తల పై ఇప్పటివరకు ఇద్దరూ స్పందించలేదు. ఐష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. ఆమె అందంతో పోటీ పడే భామలు లేరు అనడంలో అతిశయోక్తి లేదు.

ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి పేక్షకులను ఆకట్టుకుంది ఈ వయ్యారి భామ. ఇదిలా ఉంటే ఐష్ ఇటీవల పారీస్‌లో జరిగిన ఫ్యాషన్‌లో వీక్‌లో లోరియల్ బ్రాండ్ అంబాసిడర్‌గా పాల్గొంది. అయితే ఈ ఫ్యాషన్‌లో వీక్‌లో ఐష్ చాలా డిఫరెంట్ గా కనిపించింది. ఆమె ముఖంలో చాలా తేడా కనిపించింది. దాంతో నెటిజన్లు ఆమె ఫేస్‌పై షాకింగ్ కామెంట్స్‌ చేశారు. అయితేఐష్ పై వస్తున్న ట్రోల్స్ నేపథ్యంలో రెడ్డిట్ అనే యాప్ లో ఓ షాకింగ్ విషయాన్నీ పోస్ట్ చేశారు. ఇందులో ఐశ్వర్య అనారోగ్య సమస్యలతో పోరాడుతుందని.. ఆమె ఓ ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతుందని, అనారోగ్య సమస్యల కారణంగా ఆమె ఎలాంటి మెడిసిన్ కూడా తీసుకోలేకపోతుందని తెలిపారు.

అందుకే ఆమె ముఖం అలా అయ్యిందని ఆ పోస్ట్ లో రాసుకొచ్చారు. దాంతో ఐశ్వర్య ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఐష్ ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. నిజంగానే అనారోగ్య సమస్యలు వచ్చాయా..? లేక రూమర్ ఏమైనా క్రియేట్ చేస్తున్నారా.? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వార్తలో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇవి కేవలం రూమర్స్ మాత్రమే అవ్వాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *