హాస్పిటల్ లో చేరిన శ్రీదేవి కూతురు జాన్వీ క‌పూర్. ఎప్పుడు ఎలా ఉందొ తెలుసా..?

divyaamedia@gmail.com
1 Min Read

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‍గా చేస్తున్నారు. ఈ చిత్రంతోనే ఆమె టాలీవుడ్‍లోకి అడుగుపెడుతున్నారు. ఈ సినిమాలో లంగావోణిలో పల్లెటూరి అమ్మాయిగా జాన్వీ కనిపించనున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ఆమె లుక్ ఆకట్టుకుంది. దేవర చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.

అయితే ఇటీవ‌లే జాన్వీ క‌పూర్ ప్రియుడు శిఖ‌ర్ ప‌హారియాతో క‌లిసి అనంత్ అంబానీ-రాధికా మ‌ర్చెంట్ వివాహానికి హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. మూడు రోజుల పెళ్లిని జాన్వీ ద‌గ్గ‌రుండి మ‌రీ జ‌రిపించింది. ఆ వేడుక‌ల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొంది. ఇంత‌లోనే జాన్వీ ఆసుప‌త్రిలో చేర‌డం చూసి అభిమానులు షాక్ తిన్నారు. క‌ల్తీ ఆహారం కార‌ణంగా అనారోగ్యానికి గుర‌వ్వ‌డంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

ప్ర‌స్తుతం ఆమె ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంది. రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయి ఇంటికొస్తుంది. ఇక జాన్వీక‌పూర్ హిందీ, తెలుగు సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ స‌ర‌స‌న ‘దేవ‌ర‌’లో న‌టిస్తోంది. అమ్మ‌డికిదే తొలి పాన్ ఇండియా సినిమా. ఈ సినిమా విజ‌యం సాధిస్తే జాన్వీ రేంజ్ మారిపోతుంది. అలాగే ఈ సినిమా రిలీజ్ కి ముందే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ 16వ చిత్రంలోనూ ఛాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే.

అలాగే బాలీవుడ్ లో కొత్త ప్రాజెక్ట్ ల‌కు సైన్ చేసే బిజీలో ఉంది. ‘స‌న్నీ సంస్కారీ కి తుల‌సీ కుమారి’ లో న‌టిస్తోంది. ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. అలాగే కొత్త సినిమాల‌కు అడ్వాన్సులు అందుకుంటుంది. ఇప్ప‌టి నుంచే జాన్వీ క‌పూర్ 2025 డేట్లు కూడా లాక్ చేసే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *