సత్యదేవ్ హీరోగా నటించిన గాడ్సే సినిమాతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చింది కేరళ అందం ఐశ్వర్య లక్ష్మి. ఈ సినిమా పెద్దగా ఆడకపోయేసరికి ఐశ్వర్యకి మళ్లీ తెలుగులో అవకాశం రాలేదు. కానీ మలయాళం, తమిళ సినిమాల్లో ఐశ్వర్యకి మంచి క్రేజ్ ఉంది. అయితే వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది ఈ అమ్మడు. గ్లామరస్ పాత్రలతో పాటు నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ తెచ్చుకుంది.
క్యూట్ లూస్, ఆకట్టుకునే స్మైల్ తో కనిపించే ఈ బ్యూటీ.. సడన్‌గా ఇలా చేతికి సెలైన్ బ్యాండేజ్‌తో కనిపించి షాక్ ఇచ్చింది. ఆమెకు ఏమైంది అంటూ అభిమానులు తెగ కంగారు పడుతున్నారు. ఆ ముద్దుగుమ్మ త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు, కామెంట్స్ చేస్తున్నారు. ఈ బ్యూటీ మలయాళ ఇండస్ట్రీ చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక తమిళ్ లో యాక్షన్ అనే సినిమాతో పరిచయం అయ్యింది.
ఇక సత్యదేవ్ హీరోగా నటించిన గాడ్సే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఐశ్వర్య లక్ష్మీ. ఈ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో తెలుగులో పెద్దగా గుర్తింపు రాలేదు. ఆతర్వాత అమ్ము అనే సినిమాలో నటించింది. ఆ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించి మెప్పించింది. ఈ సినిమాలో తన నటనతో ఆకట్టుకుంది అలాగే తమిళ్ లో తెరకెక్కిన మట్టి కుస్తీ సినిమాలోనూ నటించింది. ఈ సినిమా తెలుగులోనూ డబ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
అలాగే మలయాళంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన కింగ్ ఆఫ్ కొత సినిమాలో నటించింది. ఇక ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమాలో హీరియిన్ గా నటిస్తుంది ఈ అమ్మడి. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ చిన్నది . తాజాగా ఈ అమ్మడు అనారోగ్యానికి గురైంది. అందుకు సంబందించిన ఫోటోలను పంచుకుంది.