మామతో గొడవకు దిగిన రాధిక మర్చంట్..? వైరల్ అవుతున్న వీడియో.

divyaamedia@gmail.com
2 Min Read

పల్లె పట్నంతేడాలేకుండా ప్రతి చోట కూడా .. బొజ్జ గణపయ్యలను ఏర్పాటు చేసుకుని మరీ పూజించుకుంటారు. చాలా మంది వినాయక నవరాత్రుల్ని ఎంతో గ్రాండ్ గా జరుపుకుంటారు. చిన్నా, పెద్ద తేడా లేకుండా గణేష్ ఉత్సవాలలో ఫుల్ జోష్ గా పాల్గొంటారు. అయితే ముఖేష్ అంబానీ కుటుంబం తరచుగా వార్తలలో ఉంటున్నారు. ఇటీవల వినాయక ఉత్సవాల నేపథ్యంలో… ఈ కుటుంబం ముంబైలోని ఆంటిలియాలోని తమ ఇంటిలో గణపయ్య ఉత్సవాలను ఫుల్ జోష్ గా జరుపుకున్నారు. ఈ వేడుకలకు బాలీవుడ్ నుంచి ప్రముఖులు.. కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్, కియారా అద్వానీ, సారా అలీ ఖాన్, సల్మాన్ ఖాన్, అనన్య పాండే, రితీష్ దేశ్‌ముఖ్ వంటి స్టార్ లు హజరయ్యారు.

రాధిక మర్చంట్ ముఖేష్ కుటుంబంలోకి వచ్చిన తర్వాత తొలి పండుగ కావడంతో… అంబానీ ఫ్యామిలీ సైతం ఫుల్ జోష్ గా పండుగను జరుపుకున్నారు. అంతేకాకుండా.. గణపయ్య విసర్జన కార్యక్రమం కూడా అంతే గ్రాండ్ గా నిర్వహించారు. ఈ వేడుకలో… అనంత్, రాధికల తీన్మార్ స్టెప్పులు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాయని చెప్పుకొవచ్చు. గణపయ్య నిమజ్జన వేడుక బారత్ ఎంతో గ్రాండ్ గా జరిగింది. నీతా అంబానీ సైతం ఈ వేడుకల్లో ఫుల్ జోష్ తో పాల్గొన్నారు.ఈ క్రమంలో తాజగా, ముఖేష్ అంబానీ తన కుటుంబంతో కలిసి ముంబైలోకి ఫెమస్ లాల్ బగ్చా రాజా గణేష్ ను దర్శనం చేసుకొనేందుకు వెళ్లారు. అక్కడ జరిగిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ముఖేష్ అంబానీ తన సతీమణి నీతా అంబానీ, కుమారుడు అనంత్, రాధిక మర్చంట్ లతో కలిసి ముంబైలోకి లాల్ బాగ్చా గణేష్ ను దర్శనం చేసుకునేందుకు వెళ్లారు. అక్కడ మరో కోడలు శ్లోకా మెహాతా కూడా ఉన్నారు. ఇదిలా ఉండగా గణేష్ ను దర్శనంచేసుకున్నారు. అంబారీ ఫ్యామీలినీ చూసేందుకు అక్కడి వాళ్లు ఆసక్తి చూపించారు. అక్కడ పోలీసులు కూడా ఎలాంటి తోపులాట జరగకుండా ప్రత్యేకంగా చర్యలు చేపట్టారు. లాల్ బాగ్చా గణేష్ ను దర్శనం చేసుకున్నాక.. అంబానీ కుటుంబంబైటకు వచ్చింది. ఆసమయంలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.

అనంత్ అంబానీ, రాధికలు ఆస్పత్రికి వెళ్తున్నామంటు మాట్లాడుకుంటున్నట్లు వీడియోలో కన్పిస్తుంది. ఇంతలో ముఖేష్ అంబానీ తాను కూడా.. ఆస్పత్రికి వస్తానంటూ చెప్తాడు. కానీ అనంత్ ,రాధిక లు మాత్రం రావాల్సిన అవసరంలేదంటూ.. కూడా తండ్రితో చెప్తాడు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *