పవన్ కళ్యాణ్ చాలా ఇష్టంగా తినే తెలుగింటి భోజనం ఎదో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

జనసేన పార్టీ ని స్థాపించిన ఈయన దాదాపు పది సంవత్సరాల పాటు ఎంతో కష్టపడ్డారు రాజకీయాలలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారు. అయినప్పటికీ వెనకడుగు వేయకుండా కసితో తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గత ఎన్నికలలో భారీ మెజారిటీతో గెలవడమే కాకుండా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు కూడా తీసుకుంటూ రాజకీయంగా కూడా మంచి సక్సెస్ అందుకున్నారు.

పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ కు సబంధించిన ఓ న్యూస్ తాజాగా వైరల్ అవుతోంది. అదేంటంటే పవన్ కళ్యాణ్ కు బాగా ఇష్టమైన ఫుడ్ ఏది. ఆయన బాగా ఇష్టంగా తినే ఐటమ్ ఏంటి. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎప్పుడూ స్పందించింది లేదు కాని.. ఆయన అన్న నటుడు జనసేన నాయకుడు నాగబాబు మాత్రం ఈ విషయంలో క్లారిటీ ఇచ్చారు. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా ఇష్టంగా తినే ఫుడ్ పలావ్. అవును ఆంధ్రా స్టైల్ లో చేసే బిర్యానీని పలావ్ లేదా పులావ్ అంటుంటారు.

ఈ పలావు ను పవన్ చాలా ఇష్టంగా తింటారట. రోజు తినే ఫుడ్ కంటే ఎక్కువగా పలావ్ఉన్న రోజు భోజనం చేస్తారట పవన్ కళ్యాణ్. గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోనాగబాదు ఈ విషయాన్ని వెల్లడించారు. పవన్ ఎక్కువగా ఏం ఫుడ్ తింటారు అని నాగబాబుకు ప్రశ్న ఎదురవ్వగా.. పలావ్ అంటే తమ్ముడికి ఇష్టం. అది ఉంటే కాస్త ఎక్కువగా తింటాడు అని అన్నారు. ఇక నాగబాబు చెప్పిన ఈ విషయం తెగ వైరల్ అయ్యింది.

ఇక ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్.. నెక్ట్స్ తన సినిమాలు కంప్లీట్ చేయడానికి టైమ్ కేటాయించబోతున్నారు. ఆయన గతంలో పెడ్డింగ్ పెట్టిన మూడుసినిమాలు సగం షూటింగ్ అయిపోయి ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ, వీరమల్లు తో పాటు ఓజీ సినిమాలను త్వరలో కంప్లీట్ చేయబోతున్నారు పవన్.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *