ఛత్తీస్‌గఢ్‌లోని శనిచారి బజార్‌కు చెందిన ఓ బడా వ్యాపారవేత్తకు ఐదుగురు కుమార్తెలు, ఒక కుమారుడు. వారిది జైన కుటుంబం. ఐదుగురు కుమార్తెలకు అబ్బాయిలను వెతికి, వారికి పెళ్లి చేసే సరికి కుమారుడి వివాహం వాయిదా పడుతూ వచ్చింది. చివరికి అతడికి 43 ఏళ్లు వచ్చాయి. కుమారుడి కోసం తండ్రి ఎన్నో సంబంధాలు చూశాడు. కానీ జైన యువతినే ఇచ్చి వివాహం చేయాలనుకున్నాడు. ఈ బలహీనతను అడ్వాంటేజ్‌గా తీసుకున్నాడు ఓ మధ్యవర్తి. అతడి పేరు మహావీర్ జైన్. అతడిది గుజరాత్‌లోని సూరత్. వ్యాపారవేత్త తన కుమారుడి వివాహం గురించి మహావీర్‌తో చర్చించాడు.
మహావీర్ వెంటనే స్పందిస్తూ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వివాహ పరిచయ వేదిక నడిపే సరళ అనే మహిళ తనకు తెలుసునని, ఆమెకు ఎన్నో జైన కుటుంబాలతో సంబంధాలు ఉన్నాయని నమ్మబలికాడు. సరళ ఇండోర్‌కు చెందిన పూజా జైన్ అనే యువతి ప్రొఫైల్ పంపిందని చెప్పి వ్యాపారవేత్తకు చూపించాడు. వెంటనే వ్యాపారవేత్త కుమారుడు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వధువును చూసేందుకు ఇండోర్ వెళ్లాడు. వ్యాపారి కుటుంబం ఇండోర్ చేరుకోగానే సరళ జైన కుటుంబాన్ని పరిచయం చేస్తున్నందుకు వారి నుంచి రూ.1.50 లక్షలు వసూలు చేసింది. తర్వాత ఓ ఇంటికి తీసుకెళ్లి పూజా జైన్ పేరుతో ఓ యువతిని పరిచయం చేసింది.
ఆమెకు తమ్ముడు కూడా ఉన్నట్లు ఓ బాలుడిని చూపించింది. వారిది జైన కుటుంబమని నమ్మించింది. దీంతో వివాహం నిశ్చయం చేసుకుందామని వ్యాపారి కుటుంబం ఫిక్స్ అయింది. ఏప్రిల్ 9న యువతి తరఫు నకిలీ కుటుంబ సభ్యులతో వ్యాపారి కుటుంబానికి మధ్య వివాహం గురించి చర్చలు జరిగాయి. పెళ్లికి రూ.16 లక్షల వరకు ఖర్చవుతాయని, ఆ ఖర్చు మొత్తాన్ని వరుని కుటుంబమే భరించాలని, ఆ సొమ్ము చేతిలో పెట్టాలని యువతి కుటుంబం డిమాండ్ చేసింది. వెంటనే వ్యాపారి సరళ సమక్షంలో రూ.5.5 లక్షలను యువతి కుటుంబానికి అందజేశారు.
ఇదే నెల 23న వధూవరులకు నిశ్చితార్థం జరగగా, ఆ రోజు యువతి కుటుంబం మరో రూ.3 లక్షలు వసూలు చేసింది. మే 3న ఇండోర్‌లోని ఓ ప్రముఖ హోటల్‌లో అంగరంగ వైభవంగా వివాహం జరిగింది. వ్యాపారి పెండ్లికి ముందే వధువు కుటుంబానికి రూ.8.9 లక్షలు ముట్టజెప్పాడు. ఇలా కుమారుడి వివాహం కోసం మొత్తం రూ.17.5 లక్షలు చెల్లించాడు. పెళ్లి రోజు రాత్రి వరుడికి ఎందుకు అనుమానం వచ్చిందో తెలియదు కానీ.. వెంటనే వధువును తన ఆధార్ కార్డు చూపించమని అడిగాడు. అందుకు పూజా జైన్ నిరాకరించింది.
కానీ చివరకు ఆధార్ కార్డు చూపించక తప్పలేదు. ఆధార్ కార్డులో పూజా జైన్‌కు బదులు వేరే పేరు, వేరే ఇంటి పేరు ఉండడంతో వరుడు తలపట్టుకున్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు అక్కడికి వచ్చారు. పూజా జైన్‌ను తమదైన శైలిలో విచారించగా అసలు విషయం బయటపడింది. దీంతో పోలీసులు మధ్యవర్తి మహావీర్, వివాహ పరిచయ వేదిక నిర్వాహకురాలు సరళ, నకిలీ వధువు పూజా జైన్‌తో పాటు మరోనలుగురిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.