పెళ్లి అనగానే ఎక్కడలేని భయాలు, ఫ్యూచర్ గురించిన ఆలోచనలు వెంటాడడం సహజం. అందుకే చాలామంది వాటి గురించి ఆలోచించకుండానే ‘నో’ చెప్పేస్తున్నారు. అయితే మ్యారేజ్ లైఫ్ హ్యాపీగా సాగిపోవాలంటే పెళ్లికి ముందే మీ భయాలను నివృత్తి చేసుకోవాలి. కాబోయే పార్ట్నర్తో కొన్ని విషయాల్లో స్పష్టత తెచ్చుకుంటే ఫ్యూచర్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మ్యారిటల్ లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది. అయితే ‘వరుడి వార్షిక ఆదాయం రూ.30 లక్షలు ఉండాలి. అదే విదేశాల్లో ఉంటున్న వరుడికైతే కనీసం రూ.80 లక్షల ఆదాయం రావాలి. పెళ్లి తర్వాత అత్తమామలతో కలిసి ఉండకూడదు.
కనీసం స్టార్ హోటళ్లలో స్టే చేయించగలిగే వారికి ప్రాధాన్యత..’ ఇవన్నీ భర్త నుంచి విడాకులు తీసుకున్న ఓ మహిళ మరో వరుడి విషయంలో కోరుతున్న గొంతెమ్మ కోరికలు. మొదటి పెళ్లి పెటాకులైనా సరే, ఆమె రెండో పెళ్లి చేసుకోవాల్సిన వరుడు ఇలా ఉండాలని ఒక మహిళ డిమాండ్లు చేస్తోంది. ఆమెకు సంబంధించిన ప్రొఫైల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ప్రొఫైల్‌కు కొందరు ఫన్నీగా రిప్లై ఇస్తుంటే.. మరికొందరు మాత్రం ఘాటుగా స్పందిస్తున్నారు. ప్రొఫైల్‌లో ఉన్న వివరాల ప్రకారం.. ఆమె ఉత్తర భారత్‌కు చెందిన మహిళ. వయస్సు 39 ఏళ్లు. కొన్నాళ్ల క్రితం భర్త నుంచి విడాకులు తీసుకుంది.
బీఎడ్ ఆమె విద్యార్హత. ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది. వార్షిక ఆదాయం రూ.1.3 లక్షలు. కానీ ఆమెకు రెండోసారి కాబోయే మొగుడు ఎలా ఉండాలో సోషల్ మీడియాలో చెప్పి, నెటిజన్లకు షాక్ ఇచ్చింది. వరుడి విద్యార్హత ఎంబీఏ లేదా అమెరికాలో ఎంఎస్ చేసి ఉండాలి. కనీసం సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయితే ఓకే. వార్షిక ఆదాయం భారత్‌లో అయితే కనీసం రూ.30 లక్షలు, ఇతర దేశాల్లో అయితే రూ.80 లక్షలు ఉండాలట. అతడికి కచ్చితంగా 3బీహెచ్‌కే ఇల్లు ఉండాల్సిందేనట. ఒకవేళ ఇండియాలో కాకపోతే యూకే, అమెరికా అయినా ఫర్వాలేదట. పెళ్లి తర్వాత ఆమె తల్లిదండ్రులు కూడా అదే ఇంట్లో ఉంటారట. ఆమె ఇంటిపని, వంట పని చేయదంట. కాబట్టి వంట వండేందుకు కుక్‌ను, ఇంటిపని చేసేందుకు పని మనిషిని పెట్టాల్సిందేనట.
తాను ఫుడ్ లవర్ అని ఆమె చెబుతోంది. అందుకే తనకు నచ్చినవి వండి పెట్టించడమో.. ఆన్లైన్లో బుక్ చేయించడమో చేయాలట. ఆమెకు విహార యాత్రలంటే ఎంతో ఇష్టమట. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పర్యాటక ప్రాంతాల్లో కనీసం 50 ప్రాంతాలైనా భర్తతో కలిసి చూడాలనుకుంటున్నట్లు చెబుతోంది. కనీసం ఫైవ్ స్టార్ హోటళ్లలో బస చేయాలనుకుంటుంది. తనకు ఉమ్మడి కుటుంబమంటే ఏ మాత్రం ఇష్టముండదట. భర్త తరఫున వారెవరూ ఇంట్లో ఉండటానికి వీలు లేదట. అందుకు ఆమె చెప్పే కారణమేంటో తెలుసా..? చిన్న కుటుంబం, చిక్కులు లేని సంసారమట. భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకునేందుకు న్యూక్లియర్ ఫ్యామిలీనే బెటర్ అని ఆ మహిళ చెబుతోంది.
Her qualities and salary 🤡
— ShoneeKapoor (@ShoneeKapoor) September 10, 2024
Expected husbands qualities and salary🗿🗿 pic.twitter.com/NGgJvVvN9l