మంచు మనోజ్- మౌనికల దాంపత్యానికి గుర్తుగా ఈ ఏడాది ఏప్రిల్‌లో పండంటి పాపాయి జన్మించింది. ఆమెకు దేవసేన శోభా ఎమ్‌ఎమ్ అని నామకరణం చేశారు. ముద్దుగా ఆమెను ఎమ్‌ఎమ్ పులి అని పిలుచుకుంటారు. అయితే మంచు మనోజ్ సతీమణి భూమా మౌనికా రెడ్డి ఇటీవల పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. తాజాగా ఈ బిడ్డకు అన్న ప్రసన్న వేడుకగా నిర్వహించారు. ఇరు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, సన్నిహితులు ఈ ఫంక్షన్ కు హాజరయ్యారు. ఇదే సందర్భంగా మంచు లక్ష్మి తన తమ్ముడికి పెద్ద సర్ ప్రైజ్ ఇచ్చింది.
అదేంటంటే.. మంచు లక్ష్మి తన కూతురు యాపిల్ ను మనోజ్ కు తెలియకుండా ఈ కార్యక్రమానికి తీసుకెళ్లింది. అంతే తన ఇంట్లోకి అడుగు పెట్టిన కోడలిని చూసి మనోజ్ ఒక్కసారిగా ఆనందం పట్టలేకపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది మంచు లక్ష్మి. అంతే కాదు ఒక ఎమోషనల్ నోట్ కూడా రాసుకొచ్చింది. ‘ఇది మా జీవితాల్లో చాలా అందమైన రోజు.. ఈ రోజు నా హృదయం ప్రేమ, కృతజ్ఞతతో నిండిపోయింది. నా స్వీట్ చిన్న మేనకోడలు అన్న ప్రాసన్ వేడుకను మేము, మా కుటుంబం, స్నేహితులతో జరుపుకున్నఆనంద క్షణం.
హిందువులుగా మనం పాటించే, ఆచరించే ఈ సంప్రదాయాలలో నిజంగా ప్రత్యేకత ఉంది’. ‘కొత్త ప్రారంభాలు, మైలురాళ్లను గుర్తించడం, జీవిత సౌందర్యాన్ని కలిసి జరుపుకోవడం నిజంగా ఒక ప్రత్యేకమైన అనుభూతి. యాపిల్‌ను చూడగానే మనోజ్ రియాక్షన్ వెలకట్టలేనిది (ఆమెను తీసుకొచ్చి ఆశ్చర్యపరిచాను). ఈ ఆనందం వెలకట్ట లేనిది. నాకు కుటుంబం, స్నేహితులతో పాటు ఎంతో మంది మంచి వ్యక్తులు నాకు తోడుగా ఉన్నారు. నేడు వాళ్లందరూ ఆశీర్వదించారు. ఇలాంటి మంచి అనుభూతిని కలిగించిన యాత్రను ఆహ్లాదకరంగా చేసినందుకు నేను భగవంతునికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
వినాయకుడు నా చిన్న మేనకోడలు దేవసేనకు ఎప్పుడూ అండగా ఉంటాడు. ప్రేమ, సంరక్షణతో నిండిన ఇలాంటి క్షణాలు ఓ అత్తగా నా హృదయంలో నిండిపోయాయి’ అని తన ఆనందానికి అక్షర రూపమిచ్చింది మంచు లక్ష్మి. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. మనోజ్ రియాక్షన్ చాలా క్యూట్ గా ఉందంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.