జగపతిబాబు తండ్రి వీబీ రాజేంద్రప్రసాద్ బడా నిర్మాత. జగపతి ఆర్ట్స్ బ్యానర్‌పై అగ్రనటులతో సినిమాలు తీశారు. సినిమా బ్యాక్‌గ్రౌండ్ కావడంతో జగపతి బాబు లాంచింగ్ ఈజీగా జరిగిపోయింది. కానీ నటుడిగా నిలదొక్కుకోవడానికి జగపతిబాబు ఎంతో కష్టపడ్డారు. అయితే కొన్ని కొన్ని చాలా సెన్సిటివ్ విషయాలు ఉంటాయి.. అవి ఎంత దూరం పెడితే అంత మంచిది.. కానీ కొన్నిచోట్లా ఆ విషయాలు మాట్లాడితేనే అక్కడ ఉన్నవారిలో మార్పు వచ్చి మంచి జరుగుతుంది. అలాంటి మార్పుకే సీనియర్ నటుడు జగపతి ప్రయత్నం చేశాడు.
ఒకానొక సమయంలో జగపతి బాబు విజయవాడలో ఉన్న సిద్దార్ధ కాలేజీకు వెళ్లినట్టు అక్కడ కమ్మ క్యాస్ట్ గురించి మాట్లాడినట్టు చెప్పుకొచ్చారు.. జగపతి బాబు ఇలా మాట్లాడారు.. ”నేను ఒకానొక సమయంలో సిద్దార్ద్ కాలేజ్ కు వెళ్ళాను.. అక్కడ నేను క్యాస్ట్ ఎగైనెస్ట్ మాట్లాడుతాను అని చెప్పను.. కానీ ప్రిన్సిపాల్ దయచేసి అలా మాట్లాడకండి.. రెండు వేలమంది స్టూడెంట్స్ ఉన్నారు.. అందరూ కమ్మ పిచ్చోళ్లు.. క్లోజ్డ్ ఆడిటోరియం.. ముక్కలు ముక్కలు నరికేస్తారు .. మీరు దయచేసి మాట్లాడకండి అని ప్రిన్సిపాల్ అన్నారు.
ప్రిన్సిపాల్ చెప్పినప్పటికీ నేను ఆగలేదు. మైక్ తీసుకొని ఏంట్రా మీ క్యాస్ట్ గొడవ.. ఏంటి కమ్మ కమ్మ అని అంటారు.. కమ్మ ఒక్కరే కాదు అందరూ మనుషులే.. ఏదైనా అనుకోండి ఏమైనా చేసుకోండి.. మీరు వాడే పద్ధతులు కరెక్ట్ లేవు.. క్యాస్ట్ కోసం మర్డర్ లు చెయ్యడం.. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఒప్పుకోకపోవడం.. కూతుర్లను చంపేయడం ఇవన్నీ నెగటివ్ అని పటపట ఆ విషయం అంత చెప్పను… ఆఖరికి ప్రిన్సిపాల్ చెప్పిన విషయం కూడా చెప్పను..
రెండువేలమంది ఉన్నారు అని నన్ను నరికేస్తారు అని అయినా ఈ విషయం నేను మాట్లాడుతున్న నేను ఏ సెక్యూరిటీ తెచ్చుకోలేదు నేను సింగిల్ గా ఉన్నాను ఏం చేస్తారో చూద్దాం అంటే అందరూ మీరు సూపర్ సర్ ఈలలు వేశారు అని అయన చెప్పుకొచ్చారు.
Idhem chusaru Vijayawada Siddhartha College lo Thumps up banned, Coz Chiru Ad lo unadu kabatti.
— Xavier club Game Changer ™ 🚁 (@s_siechojithu) September 8, 2024
Jagapati Babu ki kuda same experience aindi.
Em Caste Pichi ra midhi 🙏🏻🙏🏻 https://t.co/Hx3NGvctXf pic.twitter.com/nmLCkU9dZh