మనం తాగే కాఫీ ఖరీదు 10 నుంచి 50 రూపాయల మధ్య ఉండొచ్చు. కానీ కోటీశ్వరురాలైన నీతా అంబానీ కాఫీ ధర మాత్రం వందలు కాదు వేలు కాదు లక్షల్లోనే ఉంటుంది. అవును ఈమె ఉదయాన్నే నిద్రలేచి రూ.3 లక్షల విలువైన కాఫీతో తన డేను స్టార్ట్ చేస్తుంది. అయితే మనదేశంలో అభినవ కుబేరుడు.. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ముఖేష్ అంబానీ ఒకరు. ఆస్తి విషయంలో ముఖేష్ కు ఏ మాత్రం తీసిపోరు నీతా అంబానీ. భర్త ఆస్తికి ఏమాత్రం తక్కువ కాదు. నీతా అంబానీ ఆస్థి నికర విలువ 3 బిలియన్ డాలర్లు.
అంటే మన దేశ కరెన్సీలో దాదాపు రూ. 250 కోట్లు. ముఖేష్ నీతా అంబానీ ఫ్యామిలీ భారతదేశంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు యాంటిలియాలో నివసిస్తున్నారు. ఈ ఇంటి ధర 15 వేల కోట్ల రూపాయలు. సహజంగానే.. ముఖేష్ ఫ్యామిలీ జీవనశైలి కూడా ఖరీదైనది. నీతా అంబానీ రోజు ఒక కప్పు టీతో మొదలవుతుంది. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే టీ ధర సంగతి పక్కన పెడితే.. టీ ని తయారు చేసే.. తాగేందుకు ఉపయోగించే టీ కప్పు ధర తెలిస్తే.. సామాన్య ప్రజలు తమ జీవితం ఆ డబ్బుతో గడిపేస్తాం అని అనుకుంటారు.
ఎందుకంటే టీ తాగేందుకు అందించే కప్పు ధర తెలిస్తే కళ్లు చెదరడమే కాదు షాక్ తింటారు. నీతా అంబానీ రోజూ టీ సిప్ చేసే కప్పు ధర లక్షల రూపాయలు! నీతా అంబానీ తాను ధరించే బట్టలు, వస్తువులు, ఉపకరణాల విషయంలో వ్యక్తిగత ప్రాధాన్యత ఇస్తుంది. అదే విధంగా తాను ఉపయోగించే పాత్రల విషయంలో కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. తాను ఉపయోగించే పాత్రలంటే కూడా చాలా ఇష్టం. నీతా అంబానీ రోజూ ఉదయం టీ తాగేందుకు ఉపయోగించే టీ-సెట్ ధర 1.5 కోట్లు.
ఒక కప్పు ఖరీదు రూ. 3 లక్షలు. దేశంలోని చాలా మంది ప్రజల సంవత్సర ఆదాయంకంటే ఎక్కువ ఈ టీ కప్పు ధర ఎక్కువ. ఎందుకు అంత ఖరీదైనది? నీతా అంబానీ ఉపయోగించే ఈ టీ -సెట్ జపాన్ నుండి దిగుమతి చేసుకున్నట్లు తెలుస్తోంది. జపాన్‌లోని పురాతన క్రోకరీ కంపెనీ నోరిటెక్ ఈ కప్పుల సెట్‌ను ఉత్పత్తి చేస్తుంది. ప్రతి సిరామిక్ కప్పుపై బంగారం, ప్లాటినం పూత తో డిజైన్ చేసి ఉంటుంది. ఈ టీ-సెట్ ధర మొత్తం ధర రూ.1.5 కోట్లు.