మలయాళ సినిమా షూటింగ్ సెట్స్‌లో క్యార్‌వాన్‌లో ఉన్న నటిని రహస్య కెమెరాలతో రికార్డ్ చేసేవారని.. వాటిని సెట్స్‌లో కొందరు నటులు మొబైల్ ఫోన్లలో చూడటం తాను స్వయంగా చూశానని సీనియర్ నటి రాధిక శరత్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. అయితే హేమ కమిటీ నివేదిక బయటకు వచ్చిన తర్వాత మలయాళ చిత్ర పరిశ్రమలో జరిగిన దారుణాలు గురించి మాట్లాడుతున్నారు. చాలా మంది నటీమణులు ముందుకు వచ్చి తమకు ఎదురైనా చేదు అనుభవాలను దైర్యంగా చెప్తున్నారు. ఇప్పటికే చాలా మంది వీటి గురించి మాట్లాడారు.
తాజాగా సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి షాకింగ్ విషయాన్ని రివీల్ చేశారు. కారవాన్‌లోని రహస్య కెమెరాలు ఏర్పాటు చేసి హీరోయిన్స్ నగ్న దృశ్యాలను చిత్రీకరిస్తారని ఆమె తెలిపారు. సెట్స్‌లో మగవాళ్లు కలిసి కూర్చుని మొబైల్‌లో హీరోయిన్స్ వీడియోలు చూస్తూ ఆనందించే సంఘటనలు తాను చూశానని రాధిక తెలిపారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హేమ కమిటీ నివేదిక ఆలస్యంగా రావడం తనను ఆశ్చర్యానికి గురి చేసిందని అన్నారు. 46 ఏళ్లుగా తాను ఈ రంగంలో ఉన్నానని అన్నారు.
దీని గురించి ఎవ్వరూ నోరు మెదపడం లేదని రాధిక అన్నారు. సినీ పరిశ్రమలో మహిళలు ఎప్పటినుంచో లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు. చాలా మంది నటీమణులు తన గదికి వచ్చి సహాయం కోరుతున్నారని, కేరళలోనే కాకుండా ఇతర భాషల్లోనూ ఇలా జరుగుతోందని రాధిక తెలిపారు. కారవాన్‌లోని రహస్య కెమెరా ద్వారా తీసిన ఫుటేజీని కూడా తాను చూశానని తెలిపారు రాధికా. మగవాళ్లు కారవాన్ లో హీరోయిన్స్ బట్టలు మార్చుకుంటుంటే సీక్రెట్ కెమెరాలు పెట్టి వీడియోలు తీసి వాటిని చూసి ఎంజాయ్ చేయడం నేను ప్రత్యక్షంగా చూశానని రాధిక తెలిపారు.
అంతే కాదు వారి ఫోన్స్‌లో ప్రతి నటికి ప్రత్యేక ఫోల్డర్లు ఉన్నాయి. వారి పేరుపై క్లిక్ చేస్తే నటీమణులు దుస్తులు మార్చుకుంటున్న వీడియోలు ఉంటాయి అని రాధిక తెలిపారు. అవి చూసిన తర్వాత భయమేసి లొకేషన్‌లో కారవాన్‌ని ఉపయోగించలేదని, బదులుగా తన హోటల్ గదికి వెళ్లేదాన్ని అని రాధికా తెలిపారు. రాధికా చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో దుమారం రేపుతున్నాయి.